కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో కోణంలో కాస్త ఆలోచించి చూసినప్పుడు.. ముందు అనుకున్నదానిలో దొర్లిన లోపాలు ఇ్టే అర్థమవుతాయి. ఇప్పుడు అలాంటి పనే చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.
ఒక విషయానికి సంబంధించి సానుకూల అంశాలతోపటు ప్రతికూల అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని ప్రస్తావించి.. హెచ్చరించిన వైనం చూసిప్పుడు సుప్రీం కోర్టు చెప్పిన మాట అక్షర సత్యం కదా అని అనుకోకుండా ఉండలేం. మహిళా ఉద్యోగులకు నెలసరి వేళ.. వారికి సెలవులు ఇచ్చే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
దీనికి సంబంధించిన చట్టాన్ని చేపట్టి.. అందుకు తగ్గ నియమాలను రాష్ట్రాలకు ఆదేశించాలని కోరారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సెలవులను తప్పనిసరి చేస్తే మహిళలకు ఉపాధి అవకాశాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న సుప్రీం.. ‘మనం అలాంటి నిబంధనల్ని తీసుకొస్తే.. కంపెనీలు మహిళలను తీసుకోవు. అలా చేస్తే.. మహిళలు నష్టపోతారు’ అని పేర్కొన్నారు.
ఇలాంటి చట్టాలతో తాము పురుషుల కంటే తక్కువనే భయం ఉద్యోగాలు చేసే మహిళల్లో క్రియేట్ చేసే అవకాశం ఉందన్న సుప్రీంకోర్టు.. రుతుక్రమం మీద అవగాహన కల్పించటం వేరని.. దానిని సన్సేషన్ చేయటం వేరుగా పేర్కొంది. ఆ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత నుంచి మహిళల్ని ఎవరూ నియమించుకోరని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది షంషద్ తన వాదనలు వినిపిస్తూ 2013లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని వర్సిటీ విద్యార్థినులకు నెలసరి సెలవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే విధంగా ప్రైవేటు కంపెనీలు అలాంటి వెసులుబాటును కల్పిచాలని కోరారు.
అలా చేయటం ద్వారా.. కంపెనీలు మహిళల్ని ఎవరూ నియమించుకోరన్న సుప్రీంకోర్టు.. ‘‘మీకు సంస్థల యజామాన్యాల మనస్తత్వం గురించి తెలియదు. ఈ సెలవును తప్పనిసరి చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన మరుక్షణం వారిని ఎవరూ నియమించుకోరు’ అని పేర్కొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. వారి కెరీర్ ఇట్టే ముగిసిపోతుంది’ అని స్పష్టం చేశారు.
ఇలాంటివాటిని తప్పనిసరి చేస్తే.. వారికి ప్రయోజనాల కోసం మనం చేసే ప్రయత్నాలు వారిభవిష్యత్తుకు అడ్డంకిగా మారతాయన్నది మర్చిపోకూడదని పేర్కొనటం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే.. నిజమే కదా? అనుకోకుండా ఉండలేం.
This post was last modified on March 13, 2026 6:01 pm
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…