‘రంగ్ దే’ చిత్రానికి విదేశాలలో తీయాలని ప్లాన్ చేసినదంతా ఇప్పుడు హైదరాబాద్‍లోనే కానిచ్చేస్తున్నారు. ఈ లాక్‍డౌన్‍లో ముందుగా అనుకున్న కొన్ని అంశాలను దర్శకుడు వెంకీ అట్లూరి మార్చి రాసుకున్నాడట. అందుకే ఇప్పుడు లొకేషన్ మారినా పెద్ద ఇబ్బందేమీ లేదట. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచన వుందని నిర్మాత నాగవంశీ చెబితే నితిన్ అభ్యంతరం చెప్పలేదట.
ఈ బ్యానర్‍తో నితిన్‍కి చాలా మంచి సంబంధాలున్నాయి. ఈ సంస్థలోనే అ ఆ, భీష్మ లాంటి హిట్ సినిమాలు చేసిన నితిన్ థియేట్రికల్‍గానే విడుదల చేయాలనే ఆంక్షలేవీ పెట్టకుండా నిర్మాతకు ఏది లాభం అనుకుంటే అది చేయమని చెప్పాడట. రంగ్ దే చిత్రానికి జీ 5 నుంచి చాలా మంచి డీల్ వచ్చిందని, వాళ్లు 36 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారని, అయితే ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ వగైరా ఏమీ వుండవని సమాచారం.
మరో రెండు కోట్లు పెంచితే ఇచ్చేయడానికి నిర్మాత సిద్ధంగానే వున్నాడని, ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. బ్యాలన్స్ షూటింగ్ అయితే మొదలు పెట్టేసారు. అక్టోబర్ ఎండ్‍కి షూట్ పూర్తి చేసుకుని అప్పటి పరిస్థితులను బట్టి కాల్ తీసుకుంటారు. ఈ సినిమా పూర్తి చేసేస్తే అంధాధూన్ రీమేక్ మొదలు పెట్టాలని నితిన్ తొందర పడుతున్నాడు.