మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లోని జీవం లేని సీన్లను సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అమాంతం పైకి లేపే ఈ క్రేజీ సంగీత దర్శకుడు భారతీయుడు 2 విషయంలో మాత్రం విమర్శలపాలవుతున్నాడు. ఒక్క పాట మెప్పించేలా లేకపోవడంతో పాటుఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి బీజీఎమ్ ఇలాగేనా ఇచ్చేదంటూ కమల్ హాసన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. దర్శకుడు శంకర్ అపరిచితుడుకి రెహమాన్ కాకుండా హరీష్ జైరాజ్ ని తీసుకున్నప్పుడు అతనా నమ్మకాన్ని రెట్టింపు స్థాయిలో నిలబెట్టుకున్నాడు. కానీ అనిరుధ్ అలా చేయలేకపోయాడు.
ఇక్కడ నమ్మకం ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. అనిరుధ్ నుంచి బెస్ట్ ఎప్పుడు ఆశించవచ్చంటే కంటెంట్ లో కనీస స్థాయిలో బలం ఉన్నప్పుడు. యావరేజ్ ఉన్నా ఎలివేట్ చేస్తాడు. జైలర్ నే ఉదాహరణగా తీసుకునే అందులో కొన్ని ఎపిసోడ్లు సౌండ్ లేకుండా కేవలం డైలాగులతో చూస్తే చాలా చప్పగా అనిపిస్తాయి. రజనీకాంత్ కారు దిగి విలన్ షెడ్డులోకి నడిచే వచ్చే సన్నివేశం ఒక్కటి చాలు ఇతని పనితనం గురించి చెప్పడానికి. ఇదే కమల్ హాసన్ విక్రమ్ ఎంత మెప్పు పొందిందో చూశాంగా. తెలుగులోనూ జెర్సీ, గ్యాంగ్ లీడర్, అజ్ఞాతవాసి మ్యూజిక్ లో తనదైన ముద్ర చూపించగలిగాడు. సెప్టెంబర్ లో దేవర వస్తోంది.
రాబోయే రోజుల్లో చాలా క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాలు పుష్ప పార్ట్ 1, గేమ్ ఛేంజర్, దేవర నుంచి చెరో ఒకటి రెండు పాటలు రిలీజయ్యాయి. వాటిలో ఎక్కువగా రీచ్ తెచ్చుకుంది మాత్రం దేవర టైటిల్ ట్రాకే. అంటే జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివలు తమకు కావాల్సిన దాన్ని రాబట్టుకున్న తీరు మంచి ఫలితాన్ని ఇచ్చిందని అనుకోవాలి. కానీ భారతీయుడు 2 లాంటి అవుట్ డేటెడ్ కాన్సెప్ట్ ని కాపాడటం ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వల్లే అవ్వదు. అంతెందుకు రెహమానే పని చేసినా ఏ అద్భుతం జరిగేది కాదేమో. ఏది ఏమైనా మంచి ఊపు మీదున్న అనిరుధ్ జోరుకి చిన్న స్పీడ్ బ్రేకర్ తగిలింది.
This post was last modified on July 12, 2024 5:07 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…