ఆ మధ్య ఆచార్య సినిమాలో తీసుకుని కొంత భాగం షూటింగ్ చేశాక హీరోయిన్ కాజల్ అగర్వాల్ భాగం తీసేయడం ఆమె అభిమానులను తెగ బాధించింది. డిజాస్టర్ కావడంతో టాపిక్ పెద్దగా చర్చలోకి రాలేదు కానీ ఒకవేళ హిట్ అయ్యుంటే మాత్రం దీని గురించి డిస్కషన్స్ జరిగేవి. భారతీయుడు సీక్వెల్ కి కాజల్ ఎంపికైనప్పుడు ఆమెను రెండో భాగంలోనే చూడొచ్చని ఫాన్స్ భావించారు. కానీ దర్శక నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఆవిడ సెకండ్ పార్ట్ లో ఉండదని, భారతీయుడు 3లో చూడాలని సన్నద్ధం చేయడంతో పెద్ద డౌట్ తీరిపోయింది. అయితే లుక్ ఎలా ఉంటుందనే డౌట్ తీరిపోయింది.
భారతీయుడు 2 క్లైమాక్స్, ఎండ్ టైటిల్స్ అయ్యాక భారతీయుడు 3 ట్రైలర్ లో కాజల్ అగర్వాల్ ని చూపించారు. వీరశేఖర్ సేనాపతి ప్రియురాలు కం భార్యగా యుద్ధ వీరుల దుస్తుల్లో ఆమెను విభిన్నంగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు శంకర్. ఇది ఎప్పుడో మూడేళ్ళ క్రితమే షూట్ చేసిన భాగం కావడంతో లుక్స్ పరంగా ఇంకా యంగ్ గా కనిపిస్తోంది. తల్లి కాకముందు తీసిన ఫుటేజ్ కాబోలు. సుకన్య తరహాలో కాజల్ కు స్వాతంత్ర పోరాటం భాగం పంచుకునే వీరమహిళా క్యారెక్టర్ ని డిజైన్ చేశారు శంకర్. రెగ్యులర్ కమర్షియల్ గ్లామర్ టచ్ లేకుండా సీరియస్ పెర్ఫార్మన్స్ మీదే దృష్టి పెట్టారు.
ఇదంతా బాగానే ఉంది కానీ భారతీయుడు 2కి వచ్చిన టాక్ చూసి కాజల్ అగర్వాల్ టెన్షన్ పడే ఉంటుంది. ఎందుకంటే దీని ప్రభావం నేరుగా భారతీయుడు 3 బిజినెస్, క్రేజ్ మీద పడనుంది. అసలే జాక్ పాట్ లాంటి ఆఫర్ అందులోనూ శంకర్ డైరెక్షన్ కావడం కాజల్ ఈ సినిమా విషయంలో బాగా ఎగ్జై టింగ్ గా ఉంది. కానీ చూస్తుంటే బజ్ ఏ మాత్రం వస్తుందో అనుమానంగానే ఉంది. అయితే కమల్ హాసన్ చెప్పినట్టు ఇండియన్ 3 కోసమే తాను ఇది ఒప్పుకున్నానని చెప్పారు కాబట్టి నమ్మకం పెట్టుకోవచ్చు. అందులోనూ రెండు నిమిషాల విజువల్స్ కంటెంట్ మీద నమ్మకం వచ్చేలానే ఉన్నాయి.
This post was last modified on July 12, 2024 4:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…