Movie News

భయం గోడలు బద్దలు కొట్టే ‘భగత్’ సింగ్

అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెలబ్రేషన్ కన్నా ఎక్కువ. ఓజి లాగా రికార్డులు బద్దలు కొట్టినా, హరిహర వీరమల్లు లాగా కంటెంట్ నిరాశపరిచినా వాళ్ళ ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మీద బయ్యర్లకు అంత నమ్మకం. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ కావడం, దర్శకుడు హరీష్ శంకర్ పంచుకుంటున్న సంగతులు మెల్లగా అంచనాలు పెంచుకుంటూ పోయాయి. అందుకే అందరి కళ్ళు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ట్రైలర్ మీద ఉన్నాయి

రెండు నిమిషాల వీడియో రూపంలో ఆ లాంఛనం జరిగిపోయింది. ఎవరికీ భయపడని పోలీస్ ఆఫీసర్ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్). స్థానిక రాజకీయ నాయకుడు (పార్తీబన్) బెదిరించాలని చూసినా తలొగ్గని రకం. అలాంటి వ్యక్తి జీవితంలో ఓ అమ్మాయి (శ్రీలీల) వస్తుంది. డాన్స్ అన్నా, సరదాగా ఉండటమన్న ఆమడ దూరంలో ఉండే భగత్ కు అతి పెద్ద సవాల్ రౌడీయిజం రూపంలో తగులుతుంది. అసలైన వయొలెన్స్ అంటే ఏంటో శత్రువులకు చూపిస్తాడు. అదేంటో మార్చి 19 తేలనుంది.

చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పవన్ స్వాగ్ ఇందులో బయట పడింది. తన మీద తనే జోకులు వేసుకోవడం, చిరంజీవి ఠాగూర్ డైలాగుని తన మీద సెటైర్ కు వాడుకోవడం, ప్రాసల గురించి పంచ్ వేయడం వగైరాలన్నీ హరీష్ శంకర్ స్టైల్ లో సాగాయి. అలాని యాక్షన్ ఎలిమెంట్స్ దూరంగా పెట్టలేదు. కత్తులు, కటార్లు, గన్లు, రక్తపాతాలు, భీభత్సమైన ఫైట్లు అన్నీ ఉన్నాయి. గోత్రం, నక్షత్రం పేరుతో చివర్లో చెప్పిన డైలాగు మాస్ విజిల్స్ కోసమని చెప్పనక్కర్లేదు.

అంచనాలు పెంచడంలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ సక్సెస్ అయ్యింది. అసలు కంటెంట్ కూడా ఇదే స్థాయిలో ఉంటే కనక కలెక్షన్లు నల్లేరు మీద నడక లాగా వచ్చేస్తాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మంచి ఎలివేషన్ కు ఉపయోగపడినా కొంచం రిసౌండ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. శ్రీలీల, రాశి ఖన్నాని రివీల్ చేశారు. విలన్ ని కేవలం ఒక్క ఫ్రేమ్ కే పరిమితం చేయడం హరీష్ శంకర్ వ్యూహంలో భాగం కావొచ్చు. ఓజి తర్వాత తక్కువ గ్యాప్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తున్న పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ ర్యాంపేజ్ చేస్తారో ఇంకో అయిదు రోజుల్లో తేలనుంది.

This post was last modified on March 14, 2026 7:44 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

37 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago