‘బాహుబలి-2’ విడుదలై ఏడేళ్లు దాటిపోయింది. ఈ ఏడేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. కానీ వాటిలో ఏవీ ‘బాహుబలి-2’ ఓవరాల్ వసూళ్ల రికార్డులను బద్దలు కొట్టలేకపోయాయి.
ఓపెనింగ్స్ వరకు కొన్ని ఏరియాల్లో పైచేయి సాధించినా ఓవరాల్ వసూళ్లలో ‘బాహుబలి-2’ను ఏ చిత్రం టచ్ చేయలేకపోతోంది. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాస్‌కు కూడా ‘బాహుబలి-2’ రికార్డులను బద్దలు కొట్టడం సాధ్యం కాలేదు.
కానీ అతను ‘బాహుబలి’ తర్వాత రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న అప్‌కమింగ్ డైరెక్టర్లతోనే పని చేశాడు. వాళ్లతోనే బాక్సాఫీస్ దగ్గర ప్రతి సినిమాకూ భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగాడు.
వరుసగా మూడు డిజాస్టర్లు పడ్డా కూడా ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా చెక్కు చెదరకపోవడం విశేషం. గత ఏడాది ‘సలార్’తో, ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’తో అతను సాగిస్తున్న వసూళ్ల ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘కల్కి’కి కొంచెం డివైడ్ టాక్ వచ్చినా తొలి వీకెండ్లో సంచలన వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి నాలుగు రోజుల తొలి వీకెండ్లో. సినిమాలో ఎన్ని ఆకర్షణలు ఉన్నా.. మెజారిటీ జనాలను థియేటర్ల వైపు రప్పిస్తోంది ప్రభాస్ స్టార్ పవర్ అనడంలో సందేహం లేదు.
యుఎస్‌లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు సంచలనమే. వీకెండ్లోనే 10 మిలియన్ డాలర్లు కొల్లగొట్టేసింది. ‘బాహుబలి-2’ కంటే వేగంగా ఈ చిత్రం యుఎస్‌లో 10 మిలియన్ డాలర్ల క్లబ్బులో అడుగు పెట్టడం అసామాన్య విషయం. అంతే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యుఎస్‌లో రెండు 10 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నది ఒక్క ప్రభాస్‌కు మాత్రమే.
దర్శకుల్లో రాజమౌళి ఈ ఘనత సాధించాడు. ‘కల్కి’ ప్రభంజనం ఇంతటితో ఆగేలా లేదు. యుఎస్‌లో ‘బాహుబలి-2’ రికార్డులకు ఈ చిత్రం చేరువగా వెళ్లేలా ఉంది. ఓవరాల్ వసూళ్లు కూడా రూ.800 దాకా ఉంటాయని అంచనా