సమంతా చేతికి దళపతి విజయ్ 69

అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సమంతా తొందరపడి వచ్చిన ప్రతి ఆఫర్ కి ఎస్ చెప్పడం లేదు. తన పాత్రకు, పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటే తప్ప దర్శకులకు గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. కొంచెం లేట్ అయినా సరే పక్కా ప్లానింగ్ తో ఉంటే స్టార్ హీరోలే వెంటపడేలా చేసుకోవచ్చని త్రిష నిరూపించడంతో సామ్ లాంటి సీనియర్ హీరోయిన్లు ప్లానింగ్ విషయంలో స్ట్రాటజీలు మార్చుకుంటున్నారు. ఇటీవలే షారుఖ్ ఖాన్ తో మూవీ ఓకే అయ్యిందని ముంబై మీడియాలో తిరిగింది కానీ దానికి సంబంధించిన నిజానిజాలు ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది.

ఇక అసలు మ్యాటర్ వేరే ఉంది. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు కోలీవుడ్ స్టార్ విజయ్ ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. హెచ్ వినోత్ దర్శకత్వం కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనుంది. హీరో రెమ్యునరేషనే రెండు వందల యాభై కోట్లు ఉండవచ్చనే వార్త ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో చేస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం గోట్ పూర్తి కావొస్తున్న నేపథ్యంలో వినోత్ తన స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. పొలిటికల్ టచ్ తో సర్కార్ కంటే బలమైన సామజిక సందేశం ఉండేలా కొత్త తరహా సబ్జెక్టు సిద్ధమయ్యిందట.

ఇందులో హీరోయిన్ గా సమంతనే నిర్ధారణ కావొచ్చని చెన్నై న్యూస్. విజయ్ కు ఇదే చివరి సినిమా అవుతుందని, పార్టీ పెట్టాక మొదటి విడతలోనే అధికారంలోకి వస్తాడు కాబట్టి ఫ్యాన్స్ వినోత్ తో చేయబోయే మూవీని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో సమంతా భాగం పంచుకుంటే జాక్ పాట్ కొట్టినట్టే. ఈ ఇద్దరి కాంబోలో తేరి, అదిరింది లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. మళ్ళీ రిపీట్ కావడం ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించేదే. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చబోయే విజయ్ 69కి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా టార్గెట్ పెట్టుకున్నారు.