ఎన్టీఆర్‌ను రీప్లేస్ చేయనున్న రవితేజ

ఇప్పుడు ఒక పెద్ద సినిమాకు ప్రకటించిన రిలీజ్ డేట్‌లోకి ఇంకో క్రేజీ మూవీ రావడం అన్నది మామూలు విషయం అయిపోయింది. ఆగస్టు 15కి ముందు అల్లు అర్జున్-సుకుమార్‌ల ‘పుష్ప-2’ను అనుకుంటే.. అది వాయిదా పడడంతో ఆ డేట్లోకి రామ్-పూరి జగన్నాథ్‌ల ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చింది. మరోవైపు సెప్టెంబరు 27కు ముందు అనుకున్న సినిమా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ కాగా.. అది అనుకోకుండా వాయిదా పడిపోయింది. ఆ స్థానంలోకి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవర’ వచ్చేసింది. కాగా ఇప్పుడు తారక్ సినిమాకు అనుకున్న డేట్‌లోకి వేరే చిత్రం వస్తోందన్నది లేటెస్ట్ న్యూస్.

మాస్ రాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన ‘మిస్టర్ బచ్చన్’ణు అక్టోబరు 10న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అక్టోబరు 10 అంటే దసరా వీకెండ్. ఈ క్రేజీ వీకెండ్‌ మీద ‘మిస్టర్ బచ్చన్’ టీం కన్నేసిందట.

అక్టోబరు 10న సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘వేట్టయాన్’ కూడా రిలీజ్ కాబోతోంది. దాంతో పాటు బాలీవుడ్ నుంచి ఒకటో రెండో క్రేజీ మూవీస్ రిలీజవుతాయి. ఆ టైంలో ‘దేవర’ లాంటి పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో సోలో డేట్ కోసం ‘దేవర’ టీం ముందుకు వచ్చింది.

ఐతే ‘మిస్టర్ బచ్చన్’ తెలుగులో మాత్రమే రిలీజవుతుంది కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందేమీ లేదు. రజినీ సినిమా పోటీని తట్టుకుని తెలుగులో ఈ చిత్రం మంచి వసూళ్లే రాబట్టగలదు. ఈ చిత్రం షూటింగ్ దాదపుగా పూర్తయింది. రిలీజ్‌కు మంచి స్లాట్ కోసం చూస్తున్న టీం అన్నీ పరిశీలించి దసరాకు ఫిక్సయినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.