ఈ రోజుల్లో భారీ చిత్రాల్లో చాలా వాటిని రెండు భాగాలుగా తీస్తున్నారు. ముందు ఒక భాగంగానే మొదలుపెట్టి.. తర్వాత సెకండ్ పార్ట్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని కూడా కచ్చితంగా రెండు భాగాలుగానే తీస్తారనే అంచనాలు ఏర్పడ్డాయి. ఒక దశలో మీడియా, సోషల్ మీడియాలో కూడా ఈ మేరకు ప్రచారం జరిగింది. అసలు కమల్ హాసన్ ఫస్ట్ పార్ట్‌లో కనిపించనే కనిపించరని.. ఆయన పాత్ర రెండో భాగంలో ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ టీం నుంచి ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఈ సినిమా ఇంకొక్క రోజులో రిలీజ్ కాబోతుండగా.. ప్రస్తుతానికైతే ఇది ఒక పార్ట్ అనే అనుకుంటున్నారు. కానీ మెజారిటీ ప్రేక్షకుల్లో ‘కల్కి’కి సెకండ్ పార్ట్ ఉంటుందనే అనుమానమే ఉంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా షోలు పడబోతుండగా.. చివర్లో సెకండ్ పార్ట్ కచ్చితంగా అనౌన్స్ చేస్తారనే నమ్మకంతోనే ఉన్నారు.
‘కల్కి’ లాంటి భారీ కథలను మూడు గంటల్లో చెప్పడం అంత తేలిక కాదు. ఇందులో నాగ్ అశ్విన్ మూడు ప్రపంచాలను చూపించబోతున్నాడు. పురాణాలను కూడా టచ్ చేయబోతున్నాడు.
అతను కథ గురించి వివరించిన తీరు చూస్తేనే.. ఈ విషయాలన్నీ ఒక్క సినిమాలో చూపించడం సాధ్యమేనా అన్న సందేహాలు కలిగాయి. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా రెండు భాగాలుగానే ఉంటుందని.. ముందే ఈ విషయం చెప్పకుండా సినిమాలో సర్ప్రైజ్ చేస్తారని.. ఐతే ఫస్ట్ పార్ట్‌లో ఒక అధ్యాయం లాగా కథను చూపించి.. మరో అధ్యాయాన్ని సెకండ్ పార్ట్‌లో చూడమని చెబుతారరని.. ప్రభాస్-కమల్ మధ్య మెగా ఫైట్ అంతా సెకండ్ పార్ట్‌లోనే ఉంటుందని.. ఫస్ట్ పార్ట్‌లో కమల్ పాత్ర నిడివి తక్కువే ఉంటుందని ఇండస్ట్రీలో ఒక చర్చ జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.
This post was last modified on June 26, 2024 2:24 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……