అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి విడుదల ఇంకొద్ది గంటల్లో జరగబోతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఒకరకమైన ఉద్విగ్నత కనిపిస్తోంది. జనవరిలో సంక్రాంతి హడావిడి తప్ప ఒక్క టిల్లు స్క్వేర్ మాత్రమే అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేసింది. మిగిలిన హిట్లు, యావరేజ్ లు బ్రేక్ ఈవెన్లు అందుకుని స్వల్ప లాభాలతో బయట పడ్డాయి తప్పించి బిజినెస్ కు సంబంధించి అన్ని వర్గాలను సంతృప్తిపరిచినవి లేవు. మూడు నెలల నుంచి కనీస ఖర్చులు గిట్టుబాటు కాని థియేటర్లు పదుల్లో కాదు వందల్లో ఉన్నాయి.
ఇప్పుడు క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని సెంటర్లలో కల్కి షోలు హౌస్ ఫుల్స్ తో కిటకిటలాడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ హోరు చూస్తుంటే ఓపెనింగ్ డే ఎంత వస్తుందనేది ఊహకు అందడం లేదు. ఎన్ని షోలు వేస్తున్నా ఆన్ లైన్ లోనే టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోవడంతో బయ్యర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా నైజాం ఊచకోత మాములుగా లేదు. జిఓ రాకలో ఆలస్యం వల్ల ఏపీలో కొంత లేట్ అయినా అక్కడా అమ్మకాలు హాట్ కేక్స్ లా సాగుతున్నాయి. హిందీ బెల్ట్ లోనూ ఇరవై కోట్లకు పైగా గ్రాస్ ని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ప్రాధమిక విశ్లేషణలు మాత్రమే.
ట్రేడ్ పండితులు వేసే లెక్కలు నిజమయ్యే పక్షంలో కల్కి 2898 ఏడి మొదటి రోజు గ్రాస్ నూటా ఎనభై నుంచి రెండు వందల కోట్ల మధ్య ఉంటుంది. వారం క్రితం వరకు హైప్ పూర్తి స్థాయిలో లేదని ఫీలైన ప్రభాస్ అభిమానులు ఇప్పుడు టికెట్ల కోసం ఏర్పడిన డిమాండ్ చూసి షాక్ అవుతున్నారు. తమిళనాడులో కొంత నెమ్మదిగా ఉన్నప్పటి నిన్నటి నుంచి ఊపందుకోవడం శుభ పరిణామం. ఆర్ఆర్ఆర్, సలార్ లను సులభంగా దాటేస్తున్న కల్కికి ఇప్పుడు టాక్ కీలకంగా మారనుంది. బాగుందనే మాట చాలు కనీసం రెండు వారాల పాటు భైరవ బుజ్జిల ప్రభంజనాన్ని కళ్లారా చూడొచ్చు. అందరూ కోరుకుంటున్నది ఇదే.
This post was last modified on June 26, 2024 10:07 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…