థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూసి, చూసి చివరికి ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిన సినిమా ‘నిశ్శబ్దం’. అక్టోబరు 2న ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన అనుష్కతో పాటు తమిళ విలక్షణ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించడం విశేషం.
ఇంతకుముందు మంచు విష్ణుతో ‘వస్తాడు నా రాజు’ లాంటి ఫ్లాప్ మూవీ తీసిన హేమంత్ మధుకర్.. ఇంతి పెద్ద కాస్ట్‌తో, పెద్ద బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం విశేషమే. ఐతే ముందు అయితే అతను ‘నిశ్శబ్దం’ తీయాలనుకున్నది అనుష్కతో కాదట. దాని బడ్జెట్ కూడా తక్కువట. పైగా దీన్ని మూకీ మూవీగా తీయాలన్నది అతడి ఆలోచనట. ఐతే తర్వాత అన్నీ మారిపోయినట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘వస్తాడు నా రాజు’ తర్వాత తాను, మణిశర్మ నిర్మాతలుగా మారి తన దర్శకత్వంలో హిందీలో ‘ముంబయి 125’ అనే త్రీడీ మూవీ తీశామని.. ఐతే అది ఏమాత్రం ఆడకపోవడంతో డబ్బులన్నీ పోయాయని.. ఆపై తాను ఏదైనా వెరైటీ సినిమా చేద్దామన్న ఆలోచనతో ‘నిశ్శబ్దం’ కథ రాసుకుని ముందుగా మాధవన్‌కు వినిపించానని.. ఆయన చాలా బాగుందని అన్నారని.. తాప్సిని హీరోయిన్ పాత్రకు అనుకున్నామని.. పీవీపీ, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారని.. అప్పటికి అది మూకీ మూవీగానే అనుకున్నామని హేమంత్ తెలిపాడు.
ఐతే ఒకసారి అనుకోకుండా కోన వెంకట్‌ను కలిసినపుడు కథ చెబితే.. ఇది చాలా బాగుందని.. దీన్ని పెద్ద స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేద్దామని చెప్పాడని.. తర్వాత అనుష్కకు ఆయనే కథ చెప్పి ఒప్పించారని.. తర్వాత గోపీ మోహన్‌తో కలిసి అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కథను మార్చానని హేమంత్ వెల్లడించాడు. మూకీగా చేస్తే కమర్షియల్‌గా అనుకున్నంత స్థాయికి సినిమా వెళ్లదని, నిర్మాతల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని టాకీగానే చేయాలని తర్వాత అనుకున్నామని.. అప్పుడు కోన వెంకట్ కూర్చుని ఈ కథకు మాటలు రాశాడని.. అలా ఈ సినిమా స్వరూపం మారిపోయిందని హేమంత్ వెల్లడించాడు.
This post was last modified on September 23, 2020 12:24 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…