గత ఆరు నెలల్లో చైనాను తిట్టుకోని దేశం ఉండదు. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కరోనా వైరస్‌కు జన్మ స్థానం ఆ దేశమే అన్న సంగతి తెలిసిందే. ఆ వైరస్‌ను చైనానే అభివృద్ధి చేసి బయో వార్‌లో భాగంగా ప్రపంచం మీదికి వదిలిందనే ఆరోపణలున్నాయి. ఇదెంత వరకు నిజం అన్నది పక్కన పెడితే.. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ వల్ల ఎన్నో దేశాలు అల్లాడిపోయాయి. ఆయా దేశాల్లో అన్ని వ్యాపారాలూ దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా సినీ రంగానికి లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలలుగా చాలా చోట్ల థియేటర్లు మూతపడి ఉన్నాయి. కొన్ని చోట్ల గత నెలా రెండు నెలల్లో థియేటర్లు తెరుచుకున్నా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడట్లేదు.
భారీ అంచనాలు నెలకొన్న క్రిస్టోఫర్ నోలన్ సినిమా టెనెట్‌ను ధైర్యం చేసి గత నెలలో రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితం అందుకుంది. నోలన్ సినిమా అంటే అలవోకగా 500 మిలియన్ డాలర్లు రావాల్సింది. కానీ 250 మిలియన్లతో బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఈ సినిమా అందుకోలేని పరిస్థితి నెలకొంది. మిగతా సినిమాల గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఇలా ప్రపంచ సినిమాను పరోక్షంగా నాశనం చేసిన చైనా.. ఈ కరోనా టైంలో తన సినిమాను ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలుపుకుంది. గత నెల 21న విడుదలైన చైనీస్ మూవీ ది ఎయిట్ హండ్రెట్.. చైనాలో భారీ విజయాన్నందుకుంది. వేరే దేశాల్లో కూడా కొన్ని చోట్ల విడుదలైన ఈ చిత్రం ఇప్పటిదాకా మొత్తం 427 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి 2020 సంవత్సరానికి వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రం ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన హాలీవుడ్ మూవీ 424 మిలియన్ డాలర్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ అసలు సినిమాల రిలీజే లేకుండా చేసిన చైనా.. ఇప్పుడు హ్యాపీగా సినీ వినోదంలో మునిగితేలుతుండటం ప్రపంచ దేశాలకు మంట పుట్టిస్తోంది.
This post was last modified on September 22, 2020 12:54 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…