దెయ్యం మూవీలో మృణాల్ ఠాకూర్ ?

Mrunal Thakur
Mrunal Thakur

గత ఏడాది సీతారామంతో డెబ్యూనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా మంచి విజయాన్ని అందించింది.

హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనుకున్న టైంలో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన డిజాస్టర్ షాక్ అంతా ఇంతా కాదు. దెబ్బకు ఆఫర్లు ఆగిపోయాయో లేక తనే ఇకపై మెల్లగా అడుగులు వేద్దామని అనుకుందో కానీ మొత్తానికి నెమ్మదిగా మారిపోయింది.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే పీరియాడిక్ ప్యాన్ ఇండియా మూవీకి తన పేరే పరిశీలనలో ఉందనే టాక్ వచ్చింది కానీ ఇంకా ప్రాజెక్టే అఫీషియల్ గా లాంచ్ కాలేదు.

దీని సంగతలా ఉంచితే ఓ దెయ్యం సినిమాలో నటించమని కోలీవుడ్ ఆఫర్ మృణాల్ కు వచ్చిందని చెన్నై టాక్. లారెన్స్ హీరోగా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళబోతున్న సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కాంచన 4లో తన సరసన జోడిగా చేయమని లారెన్స్ అడిగాడని తెలిసింది.

మాములుగా ఈ ముని, కాంచన సిరీస్ లో కథానాయికలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. భయంతో అరవడానికి, హీరో పక్కన డాన్సులు చేయడానికే ఎక్కువ వాడుకుంటారు. గతంలో వేదిక, తాప్సీ లాంటి వాళ్లకు ఇది అనుభవమే. మరి మృణాల్ ఠాకూర్ ఎస్ చెబుతుందో లేదో వేచి చూడాలి. స్టోరీ నెరేషన్ మటుకు అయ్యిందట.

ప్రస్తుతం తను పూజా మేరీ జాన్ అనే హిందీ సినిమా చేసింది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నిజానికి ఫ్యామిలీ స్టార్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఆచితూచి అడుగులు వేస్తూ రెమ్యునరేషన్ పెంచాలని అనుకున్న మృణాల్ కు దాని ఫలితం పూర్తి రివర్స్ లో రావడం ఊహించని పరిణామం.

ఇప్పుడు లారెన్స్ పక్కన ఒప్పుకున్నా కెరీర్ కి ఏ మాత్రం బ్రేక్ అవుతుందో చెప్పలేం. రెగ్యులర్ ఫార్ములాని పక్కనపెట్టి కాంచన 4కి లారెన్స్ కొత్త ట్రీట్ మెంట్ ఇస్తాడని ఇన్ సైడ్ టాక్. 2025 విడుదల లక్ష్యంగా పెట్టుకున్న ఈ హారర్ మూవీ బడ్జెట్ ని గతంలోకంటే రెండు మూడింతలు పెంచారట.