ఎన్నికల ప్రచారం ఉదృతంగా ఉన్న సమయంలో తన ప్రాణ స్నేహితుడనే కారణంతో వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సంగతి గుర్తేగా. దాని మీద సోషల్ మీడియాలో ఓ మాదిరి దుమారమే లేచింది. క్యాంపైన్ చివరి రోజు పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా అదే రోజు ఫ్రెండ్ పేరుతో సీమకు వెళ్లడం పట్ల పవన్ ఫ్యాన్స్ బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలియజేశారు. ఇదంతా చూసే తెలంగాణ లోక్ సభ పోలింగ్ రోజు బన్నీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన సపోర్ట్ పవన్ కు ఖచ్చితంగా ఉంటుందని నొక్కి చెప్పాడు.
తీరా చూస్తే ఇప్పుడీ శిల్పారవిచంద్రరెడ్డి ఓటమి దిశగా వెళ్తున్నట్టు ట్రెండ్ స్పష్టం చేస్తోంది. టిడిపి అభ్యర్థి ఫరూక్ పదిహేను వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్టు ప్రాధమిక సమాచారం. ఇది ఇలాగే కొనసాగితే ఈ నెంబర్ ని దాటుకుని శిల్పా విజేతగా నిలవడం అసాధ్యం. ప్రచారానికి వచ్చినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ తను కేవలం రవిచంద్ర గెలవాలని కోరుతూ సంఘీభావం తెలిపానని అన్నాడు. అంతే తప్ప వైసిపి మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పలేదు. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించినా సరే పబ్లిక్ లోకి మాత్రం తన ఉద్దేశం మరోలా వెళ్లిపోయిందన్నది వాస్తవం.
సరే బన్నీ వచ్చినంత మాత్రాన, వేలాది అభిమానులు గుమికూడినంత మాత్రాన శిల్పా గెలుస్తాడని గ్యారెంటీ లేదు కానీ తన ప్రభావం అంతో ఇంతో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ మాత్రం తాజా పరిణామాలు చూసి షాక్ తిన్నారు. ఇదంతా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఏ కోణంలో తీసుకుంటారో చెప్పలేం కానీ పుష్ప 2 ది రూల్ విడుదల టైంలో మాత్రం తాము దూరంగా ఉంటామని చెబుతున్న ట్వీట్లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. ఊహించిన ఫలితమే అయినా ఏపీ రాజకీయ చిత్రం చాలా అనూహ్యంగా మారిపోయి సరికొత్త సంచలనాలకు దారి తీస్తున్న మాట వాస్తవం.
This post was last modified on June 4, 2024 12:48 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…