ఆ టెస్టుతో .. అడ్డంగా దొరికిపోయిన హేమ

బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో సినీ నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. మొత్తం ఈ రేవ్ పార్టీలో దొరికిన వారికి పరీక్షలు నిర్వహించగా 86 మందికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు నిర్దారణ అయింది.

అందులో నటి హేమ కూడా ఉండడం గమనార్హం. ఈ రేవ్ పార్టీలో తాను లేనని వార్తలు వచ్చిన వెంటనే హేమ ఒక వీడియో విడుదల చేసింది.

అయితే అప్పటికి హేమ పోలీసుల అదుపులో ఉండే పక్కకు వెళ్లి వీడియో చేసినట్లు తెలిసింది. హేమ విడుదల చేసిన వీడియోను చూసి పోలీసులు ఆమె మీద సీరియస్ అయ్యారు.

ఆ తర్వాత ఆమె ఒక బిర్యానీ తయారు చేసిన వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన విషయాన్ని కవర్ చేసేందుకు హేమ ఇలా పోస్ట్ చేసిందని నెటిజన్లు విమర్శించారు.

ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది రక్త నమూనాలు సేకరించగా అందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళలలో రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు.

అంటే మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్ వ్చచింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. వీరందరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించి వదిలేస్తారని తెలుస్తుంది.