చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ పర్యటన వల్ల మెగాస్టార్ చిన్న బ్రేక్ తీసుకోవడంతో కొంత గ్యాప్ ఇచ్చారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటిదాకా జరిగిన చిత్రీకరణలో ఇంటర్వెల్ ఎపిసోడ్, ఒక పాటతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు పూర్తి చేశారు. హీరో అవసరం లేని సపోర్టింగ్ ఆర్టిస్టుల సీన్స్ ఎప్పుడో అయిపోయాయి. బిజీగా ఉన్న కారణంగా త్రిషకు సంబంధించిన పార్ట్ కి ప్రాధాన్యం ఇచ్చి ఆ మేరకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే విశ్వంభరలో ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉంది. బాహుబలిలో శివగామి రేంజ్ అన్నమాట. దాన్ని పోషించేందుకు అదే స్థాయి నటీమణి కావాలి. ముందు విజయశాంతిని సంప్రదించారు కానీ ఆవిడకు మళ్ళీ సినిమాల్లో కనిపించే ఉద్దేశం లేదని మరోసారి స్పష్టం చేశారు. సరిలేరు నీకెవ్వరు టైంలోనే చెప్పినప్పటికీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడీ ఆఫర్ ఖుష్బూని వరించినట్టు ఇన్ సైడ్ టాక్. ఈవిడ చిరంజీవి అక్కయ్యగా స్టాలిన్ లో నటించడం గుర్తేగా. వీళ్ళ కాంబోలో వచ్చే ఎపిసోడ్స్ ఆ మూవీకి ఆయువుపట్టుగా నిలిచాయి. అందులోనూ త్రిషనే హీరోయిన్.
అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ దాదాపు ఓకే అయ్యిందని సమాచారం. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న విశ్వంభర షూట్ ని అక్టోబర్ లోగా గుమ్మడికాయ కొట్టించేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. జనవరి 10 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని యువి సంస్థ పట్టుదలతో ఉంది. ఆ కారణంగానే ఈపాటికే మొదలుపెట్టాల్సిన అఖిల్ 6 వాయిదా వేసుకుంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న విశ్వంభరలో అయిదుగురు తోబుట్టువులకు అన్నయ్యగా భీమవరం దొరబాబు పేరుతో చిరంజీవి కనిపిస్తారని టాక్.
This post was last modified on May 16, 2024 2:48 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…