Movie News

మళ్లీ వివరణ ఇచ్చుకున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఓవైపు మెగా ఫ్యామిలీ అంతా జనసేనకు అండగా ఉంటే.. బన్నీ ఆ పార్టీకి మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తన మిత్రుడైన వైకాపా అభ్యర్థికి ప్రచారం చేయడంపై మెగా అభిమానులు, జనసైనికుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

పార్టీలతో సంబంధం లేకుండా తన మిత్రుడి కోసం వెళ్లానని బన్నీ ఆ రోజుల్లో క్లారిటీ ఇచ్చినా కూడా అపార్థాలు తొలగిపోలేదు. ఐతే సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేసేందుకు వచ్చి మీడియాను కలిసిన బన్నీ.. మరోసారి ఆ పర్యటన గురించి వివరణ ఇచ్చాడు. అతనేమన్నాడంటే..

‘‘నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్ కళ్యాణ్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.

నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపా. ఒకవేళ భవిష్యత్తులో మా మావయ్య చంద్రశేఖర్ గారు, బన్నీ వాసు ఇలా నాకు వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులకు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తా. శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు.

బ్రదర్ మీరెప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తా అని ఆయనకు మాట ఇచ్చాను. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినపుడు వెళ్లలేకపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఈసారైనా వెళ్లాలని నా మనసులో ఉంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి నేనే ఫోన్ చేసి వస్తానని చెప్పా. అందుకే నా భార్యతో కలిసి నంద్యాలకు వెళ్లాను’’ అని బన్నీ స్పష్టం చేశాడు.

This post was last modified on May 14, 2024 7:11 am

Share

Recent Posts

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గ్రేటే

టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…

4 minutes ago

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

5 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

7 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

7 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

7 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

8 hours ago