ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది.
ఈవీఎంల ధ్వంసం నుంచి కార్లను తగల బెట్టడం.. నాయకులపైనా.. పోలింగ్ ఏజెంట్లపైనా కూడా దాడులు చేయడం.. కర్రలు, కత్తులు ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించడం వంటివి ఏపీ ఎన్నికల్లో కనిపించింది.
గుంటూరు జిల్లా పల్నాడులోని నాలుగు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, బాపట్ల జిల్లాలోనికొండపి ఎస్సీ నియోజకవర్గం, ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెడన నియోజకవర్గాల్లో అశాంతి రేపింది. ఇతర చోట్ల కూడా.. కొన్ని చెదుమొదురు ఘటనలు జరిగాయి.
ముప్పాళ్ల మండలం నార్నేపాడులో జనసేన నేత కారుకు దుండగులు నిప్పు పెట్ఆరు. రెంటచింతలలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కారును ధ్వంసంచేశారు. ఎన్టీఆర్ జిల్లా నవాబు పేట పోలింగ్ బూత్‌లో ఏజెంట్ల మధ్య గొడవ జరిగి.. పోలింగ్ రసాభాస గా మారింది. ఓటర్లు భయంతో పరుగులు తీశారు.
అనంతపురం జిల్లాలోని జేసీ వర్గానికి పట్టున్న తాడిపత్రి నియోజకవర్గంలో తీవ్ర ఘర్షన చోటు చేసుకుంది. ఏకంగా ఎస్పీ ప్రయాణిస్తున్న కారుపైనే దుండగులు రాళ్లువేశారు. ఇక, ప్రత్యర్థి పక్షం దాడుల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారు ధ్వంసమైంది.
అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం దళావాయిపల్లి గ్రామంలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు.. రెచ్చిపోయారు. ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత.. అధికారులు మరికొన్ని ఈవీఎంలను తెప్పించారు.
జనసేన ఏజెంట్ ను వైసీపీ వర్గీయులు లాగిపడేయడమే కారణమని ఇరు వర్గాలు ఆరోపించుకున్నా యి. మొత్తంగా చూస్తే.. అనేక ఘటనలు.. అనేక వివాదాల మధ్యే 2024 సార్వత్రిక సమరం ముగిసింది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
This post was last modified on May 13, 2024 8:08 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…