ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి.
ఐతే ఒక ఉదంతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. సుధాకర్ అనే ఓటరు మీద చేయి చేసుకోగా.. అతను తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యే అనుచరులు వెంటనే ఆ వ్యక్తిని చితకబాదినా.. ఎమ్మెల్యేను ఓటరు చెంపదెబ్బ కొట్టిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ స్థాయిలో ‘తెనాలి’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండడం విశేషం.
ఎమ్మెల్యే అయినా క్యూలో రావాల్సిందే అని సుధాకర్ చెప్పినందుకు శివకుమార్ ఆవేశంతో చేయి చేసుకున్నారు. దీంతో శివకుమార్ దీటుగా స్పందించాడు.
కాగా పోలీసులు వెంటనే సుధాకర్‌నే అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం గమనార్హం. ఐతే ఈ ఘటన జాతీయ మీడియాలో కూడా రిపోర్ట్ కావడం.. ఎమ్మెల్యేనే ముందు చేయి చేసుకున్న విజువల్ వైరల్ కావడంతో ఈసీ దృష్టికి వ్యవహారం వెళ్లింది.
దీంతో శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ.. పోలీసులను ఆదేశించింది. అంతకంటే ముందు ఎమ్మెల్యే మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు అండగా ఉంటుండడం నచ్చక టీడీపీ వ్యక్తి అయిన సుధాకర్.. తన భార్యతో కలిసి వెళ్తుంటే దారుణమైన మాటలు అన్నాడని.. లం.. కొడకా అని కూడా దూషించాడని.. పైగా క్యూలో వెళ్లాలని దురుసుగా మాట్లాడాడని.. దీంతో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.
కానీ ఎమ్మెల్యే వెర్షన్ నమ్మశక్యంగా లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై కౌంటర్లు పడుతున్నాయి.
This post was last modified on May 13, 2024 8:06 pm
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…