ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము తప్పు మాట్లాడామని.. ఎవరి మనోభావాలనైనా కించపరిచామని భావిస్తే సింపుల్‌గా సారీ చెప్పేస్తే సరిపోతుంది. మళ్లీ అక్కడ సన్నాయి నొక్కులు నొక్కకుండా ఉండడమే తెలివైన పద్ధతి. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని.. జనం తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఇలా ఏవేవో మాట్లాడి ఇంకా వివాదాన్ని పెద్దది చేస్తూ ఉంటారు. అవతలి వాళ్లకు ఇంకా కోపం తెప్పిస్తుంటారు. కానీ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం అలా చేయలేదు. తాను ఐపీఎల్ విషయంలో తప్పు మాట్లాడానని భావించి ఆ విషయం అంగీకరించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు. సవరించుకున్నాడు.
మొన్న ఒక సినిమా ఈవెంట్లో అనిల్ మాట్లాడుతూ.. ఈ సమయంలో ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవని.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ మధ్యలో స్కోర్లు చెక్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్ ఐపీఎల్ అభిమానులకు మంటెత్తిపోయేలా చేసింది. ఫ్రీగా టీవీలో, మొబైల్లో తమకు నచ్చే ఐపీఎల్ చూసి ఎంజాయ్ చేస్తుంటే అనిల్‌కేంటి ఇబ్బంది అని.. దీని బదులు డబ్బులు పెట్టి విషయం లేని సినిమాలు చూడాలా అంటూ అనిల్ మీద ఎదురుదాడి చేశారు. ఐపీఎల్ చూడొద్దని చెప్పడానికి నువ్వెవరు అంటూ మండిపడ్డారు.
ఫీడ్ బ్యాక్ అనిల్ వరకు వచ్చి.. లేటెస్ట్‌గా మరో ఈవెంట్లో తన వ్యాఖ్యలపై సారీ చెప్పాడు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఐపీఎల్ కామెంట్ మీద స్పందించమని అడిగితే.. ఏంటి నువ్వు కూడా హర్టయ్యావా అని నవ్వుతూ మాట్లాడిన అనిల్.. ఈ కామెంట్ విషయంలో తాను కూడా హర్టయ్యానని వ్యాఖ్యానించాడు. తాను కూడా ఐపీఎల్ అభిమానినే అని.. మొన్న ఎవరో డిస్ట్రిబ్యూటర్ సమ్మర్ సీజన్లో సినిమాలు ఆడట్లేదని.. చిన్న సినిమాలకు ఇబ్బంది అవుతోందని అంటే ఆ బాధతో ఆ కామెంట్ చేశానని.. అంతే తప్ప ఎవరినీ హర్ట్ చేయాలని కాదని.. అందరూ ఐపీఎల్ చూడాలని.. మధ్యలో ఖాళీ దొరికితే సినిమాలు చూడాలని అన్నాడు అనిల్. తన కామెంట్‌ను వెనక్కి తీసుకోవడం ద్వారా అనిల్ లౌక్యంతో వ్యవహరించాడని.. ఇలా నోరు జారినపుడు హుందాగా సారీ చెప్పి వ్యాఖ్యలను సవరించుకోవడం చాలా అవసరమని.. ఈ విషయంలో అనిల్‌ను చూసి సెలబ్రెటీలు నేర్చుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on May 5, 2024 1:08 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…