అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అల్లరోడు తన ఒరిజినల్ స్కూల్ కు వచ్చిన చేసిన మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఈ టైటిల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఈవివి సత్యనారాయణ సృష్టించిన క్లాసిక్ కామెడీ మాస్టర్ పీస్ కు అప్పట్లో దక్కిన ఆదరణ అంత సులభంగా మర్చిపోయేది కాదు. ఇప్పటికీ యూట్యూబ్ లో సీన్స్ చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అలాంటి లెగసి పేరుని వాడుకున్నప్పుడు ఆ అంచనాలను నిలబెట్టుకునే బాధ్యత కూడా ఆ ఒక్కటి అడక్కు బృందం మీద ఉంది.
ఇక్కడ ఆ ఒక్కటి ఇచ్చేయండి అంటే అర్థం పెద్ద హిట్టు ఇవ్వమని. థియేటర్లకు కనీస స్థాయిలో జనం లేక చాలా చోట్ల రోజుకు ఒకటి రెండు షోలు వేయడమే పెద్ద గగనమైపోతోంది. సిబ్బందికు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని ఎగ్జిబిటర్లు మొత్తుకుంటున్నారు. టిల్లు స్క్వేర్ లాంటి హిట్ మూవీస్ వేసుకున్న వాళ్ళకు కొంత మెరుగ్గానే ఉంది కానీ మిగిలినవాళ్ల పరిస్థితి మాత్రం అంతంతమాత్రమేనని చెప్పలి. సో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఆ ఒక్కటి అడక్కు కనక మేజిక్ చేయగలిగితే ఎండలు, ఎన్నికలు మధ్య నలిగిపోతున్న ఆడియన్స్ ని పెద్ద రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది.
యుఏ సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఆ ఒక్కటి అడక్కు నిడివి కేవలం 2 గంటల 14 నిమిషాలకు పరిమితం చేయడం మంచి పని. పైగా అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాలు నాన్ స్టాప్ గా ప్రమోషన్లలో పాల్గొంటూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాంపిటీషన్ గా మరో నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ హీరోల ఇమేజ్, జానర్ల పరంగా చూసుకుంటే ఆ ఒక్కటి అడక్కునే మాస్, క్లాస్ ఇద్దరినీ లక్ష్యంగా పెట్టుకున్న వైనం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ రాలేదు. ఆ లోటుని అల్లరోడు తీరిస్తే మాత్రం బయ్యర్ల నెత్తిన పన్నీరు జల్లు కురిపించినట్టు అవుతుంది.
This post was last modified on April 30, 2024 1:29 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…