జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్ అక్కడే ఉంటూ చిత్రీకరణ లేని టైంలో బాలీవుడ్ పార్టీల్లో కనపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. దీని కోసమే ప్రత్యేకంగా హెయిర్ స్టయిల్ మార్చి మేకోవర్ చేసుకున్న యంగ్ టైగర్ ఇంకొన్ని రోజులు అక్కడే ఉండబోతున్నాడు. దేవరకు సంబంధించిన కీలక భాగం పూర్తవ్వడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వార్ 2 యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఈ ఇద్దరి కలయికలో ఒక సాంగ్ ని షూట్ చేయబోతున్నారు.
దానికి కొరియోగ్రఫీ సమకూర్చడం కోసం వైభవి మర్చంట్ ని తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. తెలుగు ఆడియన్స్ కి తక్కువ అవగాహన ఉండొచ్చేమో కానీ ఈవిడ ఫిల్మోగ్రఫీ మామూలుది కాదు. గత ఏడాది జవాన్ లో నాట్ రామయ్య వస్తావయ్యాలో షారుఖ్ ఖాన్ తో ఏ రేంజ్ లో స్టెప్పులు వేయించిందో చూశాం. 1999 హం దిల్ దే చుకే సనమ్ లో డోలారే డోలాతో పరిచయమైన వైభవి మొదటి పాటకే జాతీయ అవార్డు సాధించడం అప్పట్లో సంచలనం. లగాన్, దేవదాస్, ధూమ్, బంటీ ఔర్ బబ్లీ, ఫనా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈవిడ ఖాతాలో ఉన్నాయి. మహేష్ బాబు అతడుకి సైతం వర్క్ చేశారు.
ఇంత ట్రాక్ రికార్డు ఉన్న వైభవి మర్చంట్ అయితేనే తారక్, హృతిక్ లు పోటీపడి వేసే స్టెప్పులకు న్యాయం జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. వార్ మొదటిభాగంని మించిన పాటలు వార్ 2 ఆల్బమ్ కోసం ప్రీతం కంపోజ్ చేసినట్టు ఇప్పటికే టాక్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఉండటంతో నాటు నాటు రేంజ్ లో అంచనాలు ఉంటాయి కాబట్టి వాటిని అందుకునేలా కష్టమైన నృత్య రీతులు రూపొందిస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదల కాబోతున్న వార్ 2 ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ పెంచేస్తోంది.
This post was last modified on April 30, 2024 10:45 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…