ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. తెలుగుతో సమానంగా హిందీలోనూ విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి బిజినెస్ డీల్స్ క్రేజీగా వస్తున్నాయి. మైత్రి మేకర్స్ ఇంకా ఫైనల్ చేయనప్పటికీ కనీసం వంద కోట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ ఖాయమనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కెజిఎఫ్ లాగా మొదటి భాగం కంటే సీక్వెలే పెద్ద హిట్ అయితే పుష్ప 2 టార్గెట్ గా పెట్టుకున్న వెయ్యి కోట్ల మార్కు అందుకోవడం అసాధ్యం కాదు.
ఇక ఘనత విషయానికి వస్తే పుష్ప 2 బెంగాలీ భాషలో డబ్బింగ్ కాబోతున్న మొదటి ప్యాన్ ఇండియా మూవీ కానుంది. గతంలో కొన్ని అనువాదం చేసినప్పటికీ సమాంతర రిలీజ్ ఎవరికీ సాధ్యపడలేదు. కానీ పుష్ప 2 అలా కాదు. ఆగస్ట్ 15 అన్ని భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అనువాద వెర్షన్ల కోసమే ప్రత్యేకంగా రెండు నెలలు ఖర్చు పెట్టాడు. సింగర్స్ ని ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి గీత రచయితలతో కూర్చుని తనకు కావలసినట్టు రాయించుకుని రికార్డింగ్ చేసే వరకు అన్నీ దేవినే చూసుకున్నాడు. మాములుగా డబ్బింగ్ పనులు అసిస్టెంట్లకు చెబుతారు.
దీన్నిబట్టే పుష్ప 2 మీద ఏ స్థాయిలో అందరూ శ్రద్ధాసక్తులతో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఐటెం సాంగ్ పెండింగ్ ఉన్న ఈ స్మగ్లింగ్ డ్రామాకు ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు సుకుమార్. ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడకుండా ఇండిపెండెన్స్ డేకి పుష్పరాజ్ ర్యాంపేజ్ ని చూపించాలని డిసైడైన సుక్కు టీమ్ దానికి తగ్గట్టే అహోరాత్రాలు పని చేస్తోంది. రేపు రిలీజ్ కాబోయే టైటిల్ సాంగ్ మీద ఓ రేంజ్ అంచనాలున్నాయి. ఈ ఒక్క పాట హైప్ ని పదింతలు పైకి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. చూద్దాం.
This post was last modified on April 30, 2024 10:43 am
టాలీవుడ్‌లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…