యువ కథానాయకుడు నితిన్ టైం ఈ మధ్య అస్సలు బాగుండట్లేదు. 2016లో వచ్చిన ‘అఆ’ తర్వాత ఎనిమిదేళ్ల వ్యవధిలో అతడికి దక్కిన ఏకైక హిట్ ‘భీష్మ’ మాత్రమే. దానికి ముందు, వెనుక వచ్చిన నితిన్ సినిమాలన్నీ డిజాస్టర్లయ్యాయి. గత ఏడాది ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, అంతకుముందు సంవత్సరం ‘మాచర్ల నియోజకవర్గం’ అతడికి చేదు అనుభవాలే మిగిల్చాయి. ఈ రెండు చిత్రాలనూ సొంత బేనర్లో తీసి చేతులు కాల్చుకున్నాడు నితిన్.
దీంతో ఇప్పుడు రిస్కులు మానేసి బయటి బేనర్లలో సినిమాలు చేస్తున్నాడు. నితిన్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా తన కొత్త సినిమాలకు నిర్మాతలు పెద్ద బడ్జెట్లే పెడుతున్నారు. నితిన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో ‘రాబిన్ హుడ్’, వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ‘తమ్ముడు’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
నితిన్‌తో ‘భీష్మ’ తీసిన వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండడంతో మైత్రీ వాళ్లు ‘రాబిన్ హుడ్’ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ సంస్థలో ఏ సినిమా తెరకెక్కినా హీరో మార్కెట్ రేంజిని మించే బడ్జెట్ పెడతారు. అలా ఈ చిత్రం మీద 45-50 కోట్ల దాకా పెట్టడానికి రెడీ అయ్యారట మైత్రీ వాళ్లు. కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి ఖర్చులు పెరిగిపోయాయి. ఎస్టిమేటెడ్ బడ్జెట్ కంటే 40-50 శాతం ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉందట.
మరోవైపు ‘తమ్ముడు’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. కేవలం ఒక యాక్షన్ ఎపిసోడ్‌కే ‘తమ్ముడు’ టీం రూ.8 కోట్లు పెడుతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర బడ్జెట్ కూడా 65-70 కోట్ల దాకా అవుతుందని సమాచారం. నితిన్ మార్కెట్ స్థాయికి ఆ బడ్జెట్ ఎక్కువ. ఈ రెండు చిత్రాలూ బ్లాక్‌బస్టర్లు అయితే తప్ప రికవరీ సాధ్యం కాదు. మరి నితిన్ ఇంత భారాన్ని మోయగలడేమో చూడాలి.
This post was last modified on April 29, 2024 10:27 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…