Movie News

రౌడీ టైటిల్‌తో విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు విజయ్ దేవరకొండ చూసింది మామూలు రైజ్ కాదు. మెగాస్టార్ చిరంజీవి సైతం తాను స్టార్ కావడానికి చాలా ఏళ్లు ఎదురు చూశానని.. కానీ విజయ్ మాత్రం తక్కువ టైంలో చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయాడని కితాబిచ్చాడు అప్పట్లో. కానీ ఈ ఫాలోయింగ్‌ను విజయ్ కాపాడుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులు ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌నూ దెబ్బ తీసేశాయి.

విజయ్ చివరి చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’కు ఓపెనింగ్స్ కరవయ్యాయి. బ్యాడ్ టాక్ రావడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సినిమా మీద ఉన్నాయి. దీంతో పాటుగా అతను మరో చిత్రం కూడా చేస్తున్నాడు. అది ‘ఫ్యామిలీ స్టార్’ను ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు బేనర్లోనే కావడం గమనార్హం.

‘రాజావారు రాణి వారు’తో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీకి స్క్రిప్టు అందించిన రవికిరణ్ కోలా.. విజయ్ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నాడు. ‘ఫ్యామిలీ స్టార్’ తరహాలో హడావుడి లేకుండా సైలెంటుగా స్క్రిప్టు పూర్తి చేసుకుని ప్రొడక్షన్‌కు వెళ్లబోతోందీ చిత్రం. కాంబినేషన్ క్రేజ్ కంటే కంటెంట్ మీద ఫోకస్ పెడుతోందట దిల్ రాజు టీం.

ఈ సినిమాకు ఆల్రెడీ టైటిల్ కూడా ఖరారైనట్లు సమాచారం. ‘రౌడీ జనార్దన్’ అనే పేరును ఓకే చేస్తున్నారట. ‘రౌడీ’ అనేది విజయ్‌ను అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు. ఆ పేరుతో మెన్స్ వేర్ బ్రాండును కూడా తీసుకొచ్చాడు విజయ్. ఇప్పుడు తన సినిమా టైటిల్‌గానూ ‘రౌడీ’ని వాడుకోబోతున్నాడట. మరి ఆ టైటిల్ విజయ్‌ కోరుకుంటున్న సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

This post was last modified on April 29, 2024 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

52 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago