టాలీవుడ్ లో చాలా మీడియం రేంజ్ సినిమాల ఓటిటి డీల్స్ డోలాయమానంలో ఉన్నాయి. ప్రాజెక్టు మొదలుపెట్టిన టైంలో ఏవేవో ఊహించుకున్న నిర్మాతల ఆశలకు అనుగుణంగా డిజిటల్ కంపెనీలు రేట్లు ఆఫర్లు చేయడం లేదు. చాలా కఠినంగా బేరాలు పెడుతున్నాయి. ఇమేజ్ ఉన్న స్టార్ అయినా సరే ససేమిరా అంటున్నాయి. దీని వల్ల కొన్ని బడ్జెట్లలో కోత వేసుకోగా మరికొన్ని షూటింగులు వాయిదా వేసుకుంటున్నాయి. ఇంకొన్ని ఏకంగా క్యాన్సిల్ దిశగా వెళ్తున్నాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నాగ చైతన్య తండేల్ కు నెట్ ఫ్లిక్స్ భారీ ధర ఇచ్చిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ ని సుమారు 40 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఇది చైతు కెరీర్ లోనే పెద్ద మొత్తం. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఇండియా పాకిస్థాన్ దేశాల్లో జరుగుతుంది. సాయిపల్లవి హీరోయిన్ కావడం, దేవిశ్రీ ప్రసాద్ లాంటి హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయడం, కార్తికేయ 2 తర్వాత చందూ మూవీ కావడం ఇవన్నీ ధర వచ్చేందుకు దోహదం చేశాయి. వీటికి తోడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్రాండ్ ప్లస్ అయ్యింది. ఫ్లాపుల సంగతి పక్కనపెడితే చైతు ఇమేజ్ ఎలాగూ మొదటి ఫ్యాక్టర్ అవుతుంది.
ఈ లెక్కన నలభై కోట్లు ఆఫర్ చేసింది నిజమే అయితే రికవరీ శాతం బాగా పెరిగినట్టు. ఎందుకంటే తండేల్ మొత్తం బడ్జెట్ వంద కోట్ల దాకా అవ్వొచ్చని ఆల్రెడీ టాక్ ఉంది. నాగ చైతన్య మార్కెట్ కి అంత మొత్తం థియేటర్ల నుంచి రాదు. సో నాన్ థియేట్రికల్ హక్కులు కీలకమవుతాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓకే చేసుకుంది కాబట్టి టెన్షన్ ఉండదు. ముందు అక్టోబర్ విడుదలనుకున్నారు కానీ అప్పటికంతా టార్గెట్ చేరుకోవడం సాధ్యం కాదని గుర్తించి డిసెంబర్ ఆప్షన్ ని సీరియస్ గా చూస్తున్నారు. సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో అక్కినేని లక్కీ మంత్ ఎంచుకోవడం బెటర్.
This post was last modified on April 29, 2024 1:38 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…