ఆదివారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చింది. మా ఇంటి బంగారం పేరుతో తన కొత్త సినిమాను ప్రకటించింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆ బేనర్ మీదే ఈ సినిమాను నిర్మించబోతుండడం విశేషం. చేతిలో గన్ను పట్టుకున్న ఇల్లాలి లుక్‌లో సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది.
కానీ ఈ చిత్రానికి దర్శకుడెవరో.. మిగతా టెక్నీషియన్లు, ఆర్టిస్టుల సంగతేంటో వెల్లడించలేదు. కనీసం దర్శకుడి పేరైనా సమంత ఎందుకు వెల్లడించలేదు అన్నది ఆశ్చర్యం కలిగించే విషయమే. దీంతో ఈ సినిమా నిజంగా తెరకెక్కేదేనా అన్న సందేహాలు కూడా జనాల్లో వ్యక్తమయ్యాయి.
ఈ సంగతలా ఉంచితే ఇప్పుడున్న స్థితిలో సమంత ప్రొడక్షన్లోకి దిగాల్సిన అవసరమేంటి అనే చర్చ కూడా జరుగుతోంది.
ఫిలిం ప్రొడక్షన్ రోజు రోజుకూ జూదంలా మారుతూ.. పేరున్న నిర్మాణ సంస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. డిజిటల్ హక్కుల మార్కెట్ బాగా దెబ్బ తినేయడంతో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసి లాభాలు చూడడం చాలా కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో సమంత ఇంకెవ్వరి భాగస్వామ్యం తీసుకోకుండా ఒంటరిగా పెద్ద రిస్క్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐతే అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకుని తిరిగి సినిమాలకు సిద్ధమయ్యాక సమంతకు కొత్త ఛాన్సులేవీ రాలేదు. ఈ మధ్య కొన్ని అల్ట్రా గ్లామరస్ ఫొటో షూట్లు చేసినా స్పందన కనిపించలేదు. కొన్ని నెలలు వెయిట్ చేసినా కొత్త ఆఫర్లు రాని నేపథ్యంలో తనే సొంతంగా సినిమాను ప్రొడ్యూస్ చేసుకోవడానికి సమంత రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ రిస్క్ ఆమెకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on April 29, 2024 1:30 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…