Movie News

ఒక్కడు పవర్ అలాంటిది మరి

ఏదైనా రీమేక్ పెద్ద విజయం సాధించినప్పుడు దాని క్రెడిట్ సగం ఖచ్చితంగా ఒరిజినల్ సృష్టించిన వాళ్లకు చెందుతుంది. ఇప్పుడీ ప్రస్తావన తేవడానికి కారణం ఒక్కడు. మహేష్ బాబుకి మాస్ లో మంచి పట్టు దక్కేలా చేసిన వాటిలో దీనికే మొదటి స్థానం. ఆ తర్వాత పోకిరి గురించి చెప్పుకోవచ్చు. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు ఎప్పటికీ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవడానికి కారణాలు అనేకం. కర్నూల్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, హైదరాబాద్ చార్మినార్ సెటప్, ప్రకాష్ రాజ్ విలనీ, హీరోయిన్ భూమిక వీటన్నిటికి మించి మహేష్ బాబు ఆన్ స్క్రీన్ చరిష్మా చేసిన మేజిక్ అలాంటిది

తమిళంలో విజయ్ స్టార్ డం విపరీతంగా పెరగడంలో దోహదం చేసింది కూడా ఒక్కడు రీమేక్ గిల్లినే. తమిళనాడులో దీన్ని రేపు గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. హంగామా ఏ స్థాయిలో ఉందంటే రెండు రోజుల ముందే బుక్ మై షోలో 60 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఒక్క చెన్నై నగరంలోనే 300కి పైగా షోలు వేస్తున్నారంటేనే క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు. ఒక్కడులాగే రీమేక్ లోనూ ప్రకాష్ రాజే విలన్ గా నటించగా భూమిక స్థానంలో త్రిష ఒదిగిపోయింది. విద్యాసాగర్ స్వరపరిచిన అపుడి పోడు అనే పాట మ్యూజిక్ లవర్స్ ని ఎంత ఊపేసిందో తెలిసిందే.

ఇదంతా చెప్పడానికి కారణం ఒకటే. గిల్లి ఇంతగా అక్కడి వాళ్లకు కనెక్ట్ అయ్యిందంటే దానికి కారణం ఒక్కడే. పైపెచ్చు పోలికల పరంగా చూసుకున్నా తెలుగు వెర్షన్ ఇచ్చినంత ఎగ్జైట్ మెంట్, గ్రాండియర్ నెస్ తమిళంలో కనిపించదు. అయినా సరే బ్రహ్మరథం పట్టారంటే ఆ ఘనత గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్, మణిశర్మలకు దక్కుతుంది. మహేష్ కి ఎలాగైతే ఒక్కడు లిఫ్ట్ గా ఉపయోగపడిందో విజయ్ కు గిల్లి ఎస్కలేటర్ గా గ్రాఫ్ ని అమాంతం పైకి తీసుకెళ్లింది. అయితే అర్జున్ కపూర్ తో తీసిన హిందీ రీమేక్ తేవర్ దారుణమైన డిజాస్టర్ కావడం ఊహించని కొసమెరుపు.

This post was last modified on April 19, 2024 6:31 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

45 mins ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

1 hour ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

1 hour ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

1 hour ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

2 hours ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

3 hours ago