గత కొన్ని నెలల్లో తెలుగులో స్ట్రెయిట్ సక్సెస్ అయిన వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే అది 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ మాత్రమే. శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ డ్రామా ద్వారా దర్శకుడు ఆదిత్య హాసన్ కు చాలా పేరొచ్చింది. ఎంతగా అంటే నితిన్ స్వంత బ్యానర్ నుంచి అడ్వాన్స్ తీసుకోవడమే కాక తననే హీరోగా పెట్టి త్వరలో ఒక సినిమా మొదలుపెట్టేంత. ఇంతే కాదు సితార సంస్థ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఆదిత్య పనితనం మెచ్చే ప్రేమలు తెలుగు డబ్బింగ్ సంభాషణల బాధ్యతని ఎస్ఎస్ కార్తికేయ కోరిమరీ ఇతనికి ఇచ్చాడు. అది బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది.
అంతా బాగానే ఉంది కానీ ఆదిత్య హాసన్ కొత్త సినిమా తాలూకు అనౌన్స్ మెంట్ హఠాత్తుగా రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రమిది. అంటే సిల్వర్ స్క్రీన్ కౌంట్ ప్రకారం ఆదిత్య హాసన్ డెబ్యూ ఇదే అవుతుంది. దీని వెనుక ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీ ఉంది. నెలల క్రితమే టీచర్ టైటిల్ తో ఆదిత్య హాసన్ రాసుకున్న ఈ స్క్రిప్ట్ ని తొలుత వెబ్ మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా షూటింగ్ జరిగింది. ఇండస్ట్రీ ప్రముఖులు పలువురు చూసి కంటెంట్ బాగుందని, థియేటర్స్ కి విడుదల చేయమని సలహా ఇచ్చారు.
దీంతో స్కెచ్ మారిపోయి టీచర్ కాస్తా స్మార్ట్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపు వచ్చేస్తోంది. నలుగురు టీనేజ్ కుర్రాళ్ళు ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాక జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ ఆసక్తికరంగా దీన్ని మలిచినట్టు ఇన్ సైడ్ టాక్. ఎలాంటి అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట. కళ్యాణ్ రామ్ డెవిల్ వ్యవహారంలో నానిన నవీన్ మేడారం దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడీ టీచర్ కూడా వర్కౌట్ అయితే ఆదిత్య హాసన్ రెండో మూడో సినిమాలకు మార్కెట్ తో పాటు క్రేజ్ కూడా పెరుగుతోంది. మధ్య తరగతి ఎమోషన్స్ మీద పట్టున్న ఈ కుర్ర దర్శకుడి డిమాండ్ మాములుగా లేదు.
This post was last modified on April 17, 2024 8:46 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…