Movie News

ప్రతినిధి-2.. సరిగ్గా మూడు వారాల ముందు

ఒకప్పుడు టాలీవుడ్లో బిజీయెస్ట్ హీర్లో నారా రోహిత్ ఒకడు. ఒక సమయంలో అతడి సినిమాలు తొమ్మిది మేకింగ్ దశలో ఉన్నాయి. అంత బిజీగా ఉన్న వాడు కొన్నేళ్ల పాటు అసలు సినిమానే చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయాడు. వరుస ఫ్లాపులు అతణ్ని వెనక్కి లాగేశాయి. ఈ గ్యాప్ తర్వాత ‘ప్రతినిధి-2’ చిత్రంతో అతను రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ మూవీకి ఇది సీక్వెల్ తరహా మూవీ.

న్యూస్ ప్రెజెంటర్ మూర్తి ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. సినిమా మొదలైనపుడు సౌండ్ చేసిన ఈ చిత్రం.. తర్వాత చాన్నాళ్ల పాటు వార్తల్లో లేకుండా పోయింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. కానీ అందరూ ఈ సినిమా గురించి మరిచిపోయిన టైంలో ఈ మధ్యే టీజర్‌తో పలకరించింది ‘ప్రతినిధి-2’.

టీజర్ చూస్తే విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది ‘ప్రతినిధి-2’. ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ‘ప్రతినిధి-2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద సెటైరిక్ ఫిలిం అన్న సంగతి తెలిసిందే. టీజర్లో లోతుగా చూపించలేదు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ మీద ఇందులో సెటైర్లు ఉంటాయని భావిస్తున్నారు.

వైసీపీని టార్గెట్ చేస్తూ.. టీడీపీకి సపోర్ట్ చేసేలా సినిమా ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముంగిట సినిమాను రిలీజ్ చేయడానికి టీం సిద్ధమైంది. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనుండగా.. దానికి మూడు వారాల ముందు సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. మరి జనాల మీద ‘ప్రతినిధి-2’ ఏమేర ప్రభావం చూపుతుందో చూడాలి.

This post was last modified on April 10, 2024 1:35 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago