ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాల్లో దేని మీద విపరీతమైన అంచనాలు లేవు కానీ ఉన్నంతలో సౌండ్ వినిపిస్తోంది గీతాంజలి మళ్ళీ వచ్చింది గురించే. శివ తుర్లపాటి దర్శకత్వంలో రచన బాధ్యతలతో పాటు నిర్మాణ భాగస్వామ్యం పంచుకున్న కోన వెంకట్ దీనికి అంతా తానై ముందు నడిపిస్తున్నారు. ప్రమోషన్ల కోసమే హీరోయిన్ అంజలి గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటూ ఈవెంట్లు, ఇంటర్వ్యూలంటూ సందడి చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. కామెడీ హారర్ జానర్ లో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు అధిక శాతం నటించారు.
ఒకరకంగా చెప్పాలంటే గీతాంజలికి మంచి ఛాన్స్ దొరికింది. దాన్ని వాడుకోవడమే తరువాయి. పోటీ పరంగా చూస్తే విజయ్ ఆంటోనీ లవ్ గురుని మైత్రి సంస్థ పంపిణి చేస్తోంది. బిచ్చగాడు సిరీస్ వచ్చినప్పుడు తప్ప హీరోగా తన ఓపెనింగ్స్ ఎప్పుడో పడిపోయాయి ఏదైనా అనూహ్యమైన టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం. కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజుల ముందే హైదరాబాద్ లో ప్రీమియర్ కూడా వేశారు. రిలీజ్ రోజు టాక్ వస్తేనే నిర్ధారణకు రాగలం. సుహాస్ నటించిన శ్రీరంగనీతులుకి ఎలాంటి బజ్ లేదు. ఎందుకో పబ్లిసిటీ సీరియస్ గా చేయకపోవడం ప్రభావం చూపిస్తోంది.
ఇంకోవైపు బాలీవుడ్ మూవీస్ బడేమియా చోటేమియా, మైదాన్ లు బరిలో ఉన్నా తెలుగు బిసి సెంటర్స్ లో వాటి ఎఫెక్ట్ అంతగా ఉండదు. ది ఫ్యామిలీ స్టార్ రెండో వారంలో పికప్ కావడం కష్టమే. టిల్లు స్క్వేర్ ని టార్గెట్ ఆడియన్స్ అందరూ చూసేశారు. అయినా మంచి ఆక్యుపెన్సీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గీతాంజలి మళ్ళీ వచ్చింది కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ డేటేసి లాభాలు అందుకోవచ్చు. ఓం భీం బుష్ ఈ విధంగా గట్టెక్కిందే కదా. రవితేజతో సినిమా ఓకే చేయించుకున్న భాను భోగవరపు ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది రైటింగ్ టీమ్ లో కీలక సభ్యుడు.
This post was last modified on April 10, 2024 2:11 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…