Movie News

పుష్ప-2 టీజర్‌పై నిట్టూర్పులు

ఈ ఏడాది ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లు.. ఇతర ప్రోమోలు అంచనాలను పెంచాయి. దీంతో ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని రిలీజ్ చేయబోయే టీజర్ మీద హైప్ మామూలుగా లేదు. ఈ టీజర్ గురించి టీం ఎంతగానో ఊరించింది.

ఐతే ఈ రోజు రిలీజైన టీజర్లో జాతర సెటప్‌లో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి. గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్ లుక్. తన మేనరిజమ్స్.. యాక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. విజువల్‌గా టీజర్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అలా అని టీజర్ పట్ల పూర్తి సంతృప్తి కూడా వ్యక్తం కావట్లేదు.

సోషల్ మీడియా జనాల నుంచి ‘పుష్ప-2’ టీజర్ విషయంలో నిట్టూర్పులు కనిపించాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పుష్ప థీమ్‌ను వాడుకుని ఏదో మొక్కుబడిగా బ్యాగ్రౌండ్ స్కోర్ లాగించేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా, ఎగ్జైటింగ్‌గా అనిపించే సౌండ్స్ ఏమీ లేవని.. ఆర్ఆర్ ఇంకా బెటర్‌గా ఉండాల్సిందని అంటున్నారు.

ఇక టీజర్ విషయంలో మరో విమర్శ ఏంటంటే.. చిన్న డైలాగ్ కూడా లేకుండా.. ఒకే సెటప్‌లో కొన్ని విజువల్స్ తీసి వదిలేయడం. దీంతో పోలిస్తే గత ఏడాది రిలీజ్ చేసిన గ్లింప్స్ క్యూరియాసిటీ పెంచిందని.. అందులో పుష్ప ఎక్కడ ఎక్కడ అని అందరూ ఉత్కంఠతో అడగడం.. చివరికి పుష్ప-పులి డైలాగ్‌తో ముగించడం ఆసక్తికరంగా అనిపించింది. కానీ టీజర్లో చిన్న డైలాగ్ కూడా లేకపోవడం పట్ల నిరాశ వ్యక్తమవుతోంది. కొసమెరుపులా చిన్న డైలాగ్ అయినా పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ మెజారిటీ ప్రేక్షకుల్లో కలిగింది.

This post was last modified on April 8, 2024 10:37 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

1 hour ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

1 hour ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

4 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago