వరుణ్ తేజ్ ఆరడుగుల అందగాడే కానీ అడపాదడపా బరువు పెరిగిపోతుంటాడు. అతని వెయిట్ ఇష్యూస్ పలు సినిమాల్లో స్పష్టంగా కనిపించాయి. ముకుంద, కంచె చిత్రాల్లో పీలగా వున్న వరుణ్ ఫిదా, తొలిప్రేమ దగ్గరకు వచ్చేసరికి బాగా బరువు పెరిగాడు. లాక్‌డౌన్‌కి ముందు బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా కోసమని వరుణ్ బరువు తగ్గడమే కాకుండా కండలు పెంచాడు. అయితే లాక్డౌన్లో కసరత్తులు పక్కనపెట్టేసి రిలాక్స్ అయిపోవడంతో మళ్లీ బరువు పెరిగాడు.
నిహారిక నిశ్చితార్థ వేడుకలో వరుణ్ లావుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో షూటింగులు జరగవు కదా అని వరుణ్ రిలాక్స్ అయిపోతే సడన్‌గా చాలా సినిమాల షూటింగులు మొదలు పెట్టేసారు. తన సినిమా కూడా మొదలు పెట్టాలనుకున్నారు కానీ వరుణ్ ఇంకా షేప్‌లోకి రాలేదు. ప్రస్తుతం వర్కవుట్స్ చేస్తూ లాక్డౌన్ ముందు ఎలా వున్నాడో అలా అయ్యే పనిలో పడ్డాడు.
వరుణ్ తేజ్ కోసమని ఈ చిత్రం షూటింగ్ మరికొన్నాళ్లు వాయిదా వేయక తప్పలేదు. డిసెంబర్ వరకు షూటింగులు మొదలు కావనే భావనతో చాలా మంది నటులు వుండడం వల్ల సడన్‌గా మొదలైన కొన్ని షూటింగ్స్ కి ఆర్టిస్టుల డేట్స్ సమస్య తలెత్తుతోందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates