ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదల తేదీ విషయంలో సందిగ్దత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నేపథ్యంలో మే 9 వద్దని డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులు వారిస్తుండటంతో నిర్మాత అశ్విన్ దత్ పునరాలోచనలో పడిన మాట వాస్తవమే. ఇంకా ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. వారం పైగా కీలక భాగం పెండింగ్ ఉందట. అదవ్వగానే మిగిలిన పనులు వేగవంతం చేస్తారు. అసలు సమస్య అది కాదు. ఏ నిర్ణయం తీసుకోవాలనే దాని గురించి స్వప్న, ప్రియాంక దత్ లు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.
సెంటిమెంట్ డేట్ కాబట్టి మే 9 వదులుకోకూడదనేది దత్తు గారి సంకల్పం. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఒకవేళ పోస్టు పోన్ తప్పదు అనుకుంటే ఆ మరుసటి వారం వెళ్లాలా లేక జూన్, జూలైలను లక్ష్యంగా పెట్టుకోవాలానేది పెద్ద మీమాంస. పోనీ ఆగస్ట్ కు షిఫ్ట్ అవుదామా అంటే పుష్ప 2 ది రూల్ వచ్చి తీరుతుందని మైత్రి మేకర్స్, దర్శకుడు సుకుమార్ సంకేతాలు పంపిస్తునే ఉన్నారు. సో ఆ ఛాన్స్ లేదు. సెప్టెంబర్ అంటే మరీ లేట్ అవుతుంది. అది కూడా రెండు వారాల లోపే జరగాలి. లేదంటే ఓజి, దేవర, గేమ్ ఛేంజర్ లు వరసగా షెడ్యూల్ చేసుకుని పెట్టారు.
సో ఈ అయోమయం తీరాలంటే ఇంకొద్ది రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. డిజిటల్ రైట్స్ ని మూడు వందల కోట్లకు పైగా అమ్మారనే టాక్ కూడా నిజం కాదట. ఓటిటి డీల్ కు సంబంధించి ఎలాంటి ఒప్పందాలు ఇంకా జరగలేదని తెలిసింది. టీజర్ వచ్చాకే మాట్లాడదామని అనుకున్నట్టు సమాచారం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వచ్చిన ఆరు నెలల లోపే ఇంకో ప్రభాస్ సినిమా చూస్తామన్న అభిమానుల ఆనందం అంత సులభంగా నెరవేరేలా లేదు. ఏ నిర్ణయమైనా వీలైనంత త్వరగా తీసుకోవాలి. వాయిదాల విషయంలో సలార్ లాగా ఇతర ఇండియా రిలీజులకు ఇబ్బంది కలక్కుండా చూడాలి.
This post was last modified on March 29, 2024 6:09 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…