Movie News

పృథ్విరాజ్ సిన్సియారిటీని మెచ్చుకోవాలి

మల్లువుడ్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కు సలార్ విలన్ గా తప్ప మన ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు లేదు. మలయాళంలో ఎంత పెద్ద స్టార్ అయినా సరే గతంలో ఈయన డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. వాటిలో ఆడనివే ఎక్కువ. కానీ ది గోట్ లైఫ్ ఆడు జీవితం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ప్రమోషన్లలో పాలు పంచుకోవడం చూస్తే ఇతర భాషల్లో బలంగా చేరవేయాలన్న కమిట్ మెంట్ కనిపిస్తోంది. అడిగినవారందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎదురైన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా విసుక్కోకుండా సమాధానమిస్తూ ఓపిగ్గా వివరాలు అందిస్తున్నాడు.

ఇతని టార్గెట్ ఒక్కటే. సంవత్సరాల తరబడి పడిన గోట్ లైఫ్ కష్టాన్ని అన్ని బాషల వాళ్ళు గుర్తించాలి. అందుకే మైత్రి సంస్థ పంపిణికి ముందుకొచ్చింది. దీనికోసమే మంజుమ్మల్ బాయ్స్ ని వారం వాయిదా వేసుకుంది. అలాంటప్పుడు పృథ్విరాజ్ అదేపనిగా హైదరాబాద్ లో ఉండి పబ్లిసిటీ చేసుకోవడం మంచిదే. ఎవరూ లేని ఎడారిలో సంవత్సరాల తరబడి ఒక మనిషి చేసే పోరాటం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ దర్శకులకు స్పెషల్ షో వేస్తే వాళ్ళతో పాటు హాజరైన పృథ్విరాజ్ ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు రావడం ఆకట్టుకుంది.

ఎల్లుండి టిల్లు స్క్వేర్ వస్తున్న నేపథ్యంలో ది గోట్ లైఫ్ ఆడు జీవితంకు టాక్ కీలకం కానుంది. 2 గంటల 56 నిమిషాల సుదీర్ఘ నిడివితో థియేటర్ కొచ్చిన ఆడియన్స్ ని మెప్పించడం సవాలే. అందులోనూ ఇంత ఎక్కువ లెన్త్ తో ఆడిన డబ్బింగ్ సినిమాలు ఈ మధ్య కాలంలో తక్కువ. కేవలం పెర్ఫార్మన్స్ పరంగానే కాకుండా ఎంగేజ్ చేసే కంటెంట్ బోలెడు ఉంటుందని, పాత్రలు తక్కువే అయినా వాటి మధ్య డెప్త్ కట్టిపడేసేలా ఉంటుందని దర్శక నిర్మాతలు హామీ ఇస్తున్నారు. నచ్చేలా ఉంటే తెలుగు జనాలకు బాషా భేదాలు ఉండవు కాబట్టి ఆడు జీవితంకి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. 

This post was last modified on March 27, 2024 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

4 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

10 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

13 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

14 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

14 hours ago