రచ్చ జరుగుతోన్నా రకుల్‍ ప్రీత్‍ గప్‍చుప్‍

రియా చక్రవర్తి డ్రగ్స్ వినియోగించే పలువురు నటీనటుల పేర్లను విచారణలో బయట పెట్టిందని, వారిలో రకుల్‍ ప్రీత్‍ సింగ్‍, సారా అలీ ఖాన్‍ పేర్లు వున్నాయని ‘టైమ్స్ నౌ’ బులెటిన్‍ ప్రసారం చేసింది. రకుల్‍ ప్రీత్‍ పేరు బయటకు రాగానే తెలుగు చిత్ర సీమలో కూడా చిన్నపాటి అలజడి మొదలయింది. అయితే తమ గురించి మీడియాలో అంత రచ్చ జరుగుతోన్నా రకుల్‍ కానీ, సారా అలీ ఖాన్‍ కానీ ఆ ఆరోపణలు అబద్ధమని ఖండించలేదు. మీడియాతో మాట్లాడకపోయినా కనీసం తమ సోషల్‍ మీడియాలో అయినా ఒక పోస్ట్ పెట్టి వుండొచ్చు. దీంతో ఈ విషయం నిజంగానే సీరియస్‍ ఏమో అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే డ్రగ్స్ వినియోగించడం పెద్ద నేరం కాదట.

ఆ డ్రగ్స్ వేరొకరి కోసం తీసుకుని వారికి మధ్యవర్తిగా వ్యవహరిస్తే చాలా పెద్ద నేరమట. రియా చక్రవర్తి అందుకే ఇప్పుడు దోషిగా అరెస్టయింది. సుషాంత్‍ కోసం ఆమె డ్రగ్స్ కొనుగోలు చేయడం, పలువురు మధ్యవర్తులతో డీల్‍ చేయడంపై చాలా ఆధారాలు వుండడం వల్లే ఆమెకు బెయిల్‍ కూడా దొరకడం లేదు. ఆమె విచారణలో ఏ నటీనటుల పేర్లు చెప్పినా కానీ వాళ్లు కేవలం మాదకద్రవ్యాలు పుచ్చుకున్నట్టు అంగీకరించేస్తే పెద్దంత పేచీ వుండదట. ఏదేమైనా మీడియాలో ఏదైనా న్యూస్‍ రాగానే దానిపై వెంటనే ఖండన రాకపోతే వాళ్లు నోళ్లు తెరిచేలోగా నేరస్థులుగా జనం దృష్టిలో పర్మినెంట్‍గా ముద్రించుకుపోయే ప్రమాదముంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)