అఫీషియల్ గా గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోయినా అభిమానులు మాత్రం లీకులతోనే సోషల్ మీడియా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇవాళ వైజాగ్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బీచ్ ఒడ్డులో భారీ ఎత్తున వేసిన రాజకీయ సభలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ప్రధాన తారాగణం పాల్గొంది. ఓపెన్ ప్లేస్ కావడంతో పబ్లిక్ ని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. షూటింగ్ స్పాట్ కొంత పరిధి వరకు ఎవరూ రాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు కానీ దూరం నుంచి చూస్తూ ఫోటోలు వీడియోలు తీస్తున్న వాళ్ళను నియంత్రించడం సాధ్యపడలేదు.
దీంతో ఇప్పుడా పిక్స్ వీడియోస్ అన్నీ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ టాలో విపరీతంగా వైరలవుతున్నాయి. స్టయిలిష్ గెటప్ లో ఐఎఎస్ ఆఫీసర్ రామ్ నందన్ గా చరణ్ లుక్ అదిరిపోగా ఎస్జె సూర్య లాంటి ఇతర క్యాస్టింగ్ కు సంబందించిన లీక్స్ కూడా బయటికి వస్తున్నాయి. సెల్ ఫోన్ కెమెరాల్లో క్వాలిటీ జూమ్ ఆప్షన్స్ ఉన్న కొందరు స్పష్టంగా షూట్ చేయడంతో ఎంచక్కా వాటిని చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంతో పాటు ప్రముఖ టూరిస్ట్ స్పాట్ కావడంతో విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న జనాలు సులభంగా అక్కడికి చేరుకుంటున్నారు.
ఇంకో నాలుగు రోజుల పాటు ఇది జరగనుంది. 20న చరణ్ హైదరాబాద్ వచ్చి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఆర్సి 16 ప్రారంభోత్సవంలో పాల్గొంటాడు. పెద్ది అనే టైటిల్ లాక్ చేసినట్టుగా సమాచారం. 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి రాబోయే పాట కోసం మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా మూవీ లీకుల బెడద ఇప్పటిది కాదు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర చేసినప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడే రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ తాలూకు గెటప్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. చూస్తుంటే వీటితోనే పబ్లిసిటీ అయిపోయేలా ఉంది.
This post was last modified on March 15, 2024 10:40 pm
తండ్రి ఒకప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్, మరోవైపు అన్న మినిమమ్ హిట్స్ అందుకుంటున్నాడు. కానీ తమ్ముడు మాత్రం ఒకప్పుడు…
కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీగా కంగువ మీద బోలెడు ఆశలు పెట్టుకున్న సూర్యకి అది కోలీవుడ్…
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…