కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడి నిర్మాతలు కుదేలయిపోయిన పరిస్థితులలో కూడా దిల్ రాజు ‘వి’ సినిమాపై పది కోట్ల లాభం వెనకేసుకున్నాడట. ఈ చిత్రానికి వడ్డీతో సహా అయిన పెట్టుబడి ముప్పయ్ ఆరు కోట్లయితే, డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులతో నలభై ఆరు కోట్లు వచ్చాయట.
అంటే నికరంగా ఈ చిత్రంపై దిల్ రాజుకు పది కోట్లు మిగిలాయన్నమాట. అదే కాదు… డిజిటల్ రిలీజ్ వల్ల ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు మిగిలిపోయాయి. సినిమాకు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ నష్టపోతున్నామని గగ్గోలు పెట్టే బయ్యర్ల తాకిడి లేదు.
ఇదే సినిమా థియేటర్లలో విడుదలై వుంటే బయ్యర్లకే ఎంతో కొంత తిరిగి కట్టాల్సి వచ్చేదని విశ్లేషకుల అభిప్రాయం. అలా దిల్ రాజు బాక్సాఫీస్ ఫ్లాప్ తప్పించుకోవడమే కాకుండా పది కోట్ల లాభం కూడా చవిచూసాడన్నమాట.
లాక్ డౌన్‍లో మంచి మంచి ఆఫర్లు అందరు నిర్మాతలకు ఇచ్చారు కానీ దిల్ రాజులా ముందుగా పెద్ద నిర్మాతలు రిస్క్ తీసుకోలేకపోయారు. మొదట్లో నిశ్శబ్ధం, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలకు కూడా చాలా పెద్ద ఆఫర్లు ఇచ్చారు. అప్పట్లో తటపటాయించిన నిర్మాతలు ఇప్పుడు దీనికే రెడీ అయ్యారు. కానీ ఆల్రెడీ అప్పుడు ఆఫర్ చేసిన అమౌంట్‍లో డిస్కౌంట్‍కి సరిపెట్టుకోక తప్పలేదు.
This post was last modified on September 11, 2020 9:49 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…