ఆగస్ట్ 15 విడుదల చేసే తీరతామని పుష్ప 2 ది రూల్ ఎంత చెబుతూ వస్తున్నా ఖచ్చితంగా వాయిదా పడుతుందన్న నమ్మకమో లేక దాన్ని తట్టుకుని నిలబడతామనే ధైర్యమో తెలియదు కానీ క్రమంగా ఆ డేట్ మీద కర్చీఫ్ వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటిదాకా రేస్ లో ఉన్న వాళ్ళలో అజయ్ దేవగన్ సింగం అగైన్, విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఈ లిస్టులో తాజాగా జైలర్ ద్వారా మనకు దగ్గరైన శాండల్ వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేరిపోయాడు. ఆయన భైరతి రణగల్ ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
ఇది 2017 మఫ్టీకి ప్రీక్వెల్. కన్నడలో పెద్ద హిట్టు. తెలుగులో రీమేక్ చేయాలని పలువురు ప్రయత్నించారు కానీ సాధ్యపడలేదు. ఇందులో శివన్న గెటప్ నే వీరసింహారెడ్డిలో రిఫరెన్స్ గా వాడుకున్నామని బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. మఫ్టీకు ముందు ఏం జరిగిందనే కథని భైరతి రణగల్ లో చూపించబోతున్నారు. నర్తన్ దర్శకుడు. ఇతను ఎవరో కాదు. సుమారు ఏడాది క్రితం రామ్ చరణ్, విజయ్ దేవరకొండలకు స్టోరీ చెప్పి దాదాపు ఓకే అనిపించుకున్నంత పని చేశాడు. కానీ ఫైనల్ వెర్షన్లు కుదరక ఎందుకో ఆ కాంబోలు సాధ్యపడలేదు. తిరిగి శివన్నతో చేరాడు.
చూస్తుంటే పుష్ప 2కి అన్ని భాషల్లో టఫ్ కాంపిటీషన్ తప్పేలా లేదు. అలా అని అల్లు అర్జున్ కి వాళ్ళేదో దెబ్బ కొడతారని కాదు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ పరంగా ఎఫెక్ట్ ఉంటుంది. నార్త్ లో అజయ్ దేవగన్ కవ్వింపు మాములుగా ఉండదు. ఇవన్నీ కొంత ప్రతికూల ప్రభావం చూపించేవే. దర్శకుడు సుకుమార్ మాత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా వైజాగ్ లో సుదీర్ఘమైన షెడ్యూల్ లో మొదలుపెట్టబోతున్నారు. వేసవిలో గుమ్మడికాయ కొట్టాలని చూస్తున్నారు. అది జరిగితేనే చెప్పిన డేట్ కి పుష్ప 2 థియేటర్లలో అడుగు పెడుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates