Movie News

సిస్టర్ సెంటిమెంట్ బలంతో విజయ్

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5 విడుదలకు రెడీ అవుతోంది. ముందు సంక్రాంతి అనుకుని ఆ తర్వాత మార్చి గురించి అలోచించి చివరికి దేవర తప్పుకోవడంతో వరస సెలవులు వచ్చే సూపర్ డేట్ అందుకుంది. దానికి తగ్గట్టే నిర్మాత దిల్ రాజు టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేయబోతున్నారు . మొన్న వదిలిన టీజర్ జనాల్లోకి బాగానే వెళ్ళింది. అభిమానులు ఇంకా ఎక్కువ ఆశించడంతో వాళ్ళను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయినా ట్రైలర్ వచ్చే దాకా అప్పుడే ఒక అంచనాకు రాలేం. టైటిల్ కు తగ్గట్టే ఇందులో లవ్ కన్నా ఎక్కువ ఫ్యామిలీ అంశాలే ఉంటాయట.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకునే మృణాల్ ఠాకూర్ ఎపిసోడ్ కి ఎంత ప్రాధాన్యం ఉంటుందో అక్కగా నటిస్తున్న వాసుకి (90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ఫేమ్) ట్రాక్ కూడా అంత వెయిటేజ్ తో ఉంటుందని సమాచారం. ముఖ్యంగా కథలోని ప్రధానమైన లింక్ వాసుకితో పాటు సోదరిగా మరో ముఖ్యమైన పాత్ర చేస్తున్న అభినయ చుట్టూ తిరుగుతుందట. స్టోరీని డ్రైవ్ చేసే కీలకమైన పాయింట్ దర్శకుడు పరశురామ్ వీళ్ళతోనే ముడిపెట్టాడని తెలిసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్మెంట్ తో నడిపించి రెండో సగంలో కీలకమైన ఎమోషన్స్ తో ఆకట్టుకుంటాడని అంటున్నారు.

ఖుషిలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ డ్రామా ఎక్కువైపోవడంతో ఆశించిన ఫలితం రాలేదని గుర్తించిన విజయ్ దేవరకొండ ఈసారి జాగ్రత్త పడినట్టే కనిపిస్తోంది. పైగా మహేష్ బాబు తరహాలో మాస్ మ్యానరిజంస్ పెట్టడం అంచనాలకు ఉపయోగపడుతోంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరిచిన నంద నందనా పాట ఆల్రెడీ చార్ట్ బస్టర్ కావడంతో మిగిలిన వాటిని కూడా అదే స్థాయిలో ప్రమోట్ చేయబోతున్నారు. పోటీ పరంగా పెద్దగా రిస్క్ లేకుండా సోలోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ కు వారం ముందు రిలీజయ్యే టిల్లు స్క్వేర్ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ ఉండటం లేదు.

This post was last modified on March 7, 2024 7:26 pm

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

8 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago