ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలింది అందాల తార శ్రీదేవి. ఇప్పుడు ఆమె తనయురాలు జాన్వి కపూర్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపించాయి. ముందుగా హిందీ సినిమాల్లోనే అరంగేట్రం చేసి పేరు సంపాదించిన ఈ అమ్మాయి.. దేవరతో దక్షిణాది సినిమాలో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా సినిమాలో నటించబోతున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే జాన్వి తండ్రి బోనీ కపూర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. చరణ్ సినిమాతో పాటు తమిళంలో సూర్యకు జోడీగానూ జాన్వి నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వార్త కాసేపటికే వైరల్ అయిపోయింది. చరణ్ సినిమాకు ఎట్టకేలకు హీరోయిన్ ఖరారైందని మెగా ఫ్యాన్స్ ఆ వార్తను సోషల్ మీడియాలో బాగా షేర్ చేశారు.
ఐతే తండ్రీ కన్ఫమ్ చేసిన విషయాన్ని జాన్వి మాత్రం ధ్రువీకరించట్లేదు. టీం అధికారికంగా చెప్పకుండా తమ కుటుంబం ఈ విషయాన్ని బయటపెట్టడం ఇష్టం లేదో ఏమో.. ఆమె తండ్రి ప్రకటనపై సమాధానం దాట వేసింది. ఇటీవల మా నాన్న నా తర్వాతి సినిమాల విషయమై నాతో సహా ఎవరినీ సంప్రదించకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటిస్తున్నానని ఆయన చెప్పారో వాటి గురించి నేను మాట్లాడలేను.
ప్రస్తుతానికి నేను దేవర, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉలజ్ సినిమాల్లో నటిస్తున్నా అని జాన్వి వెల్లడించింది. తనకు దక్షిణాది సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు ఈ సందర్భంగా జాన్వి చెప్పింది. చిన్నపుడు ఇంద్ర సినిమాను టీవీలో చూడడం తనకు ఇంకా గుర్తుందని.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తుండడంతో తన సొంతగడ్డకు తిరిగి వచ్చిన ఫీలింగ్ కలుగుతోందని ఆమె పేర్కొంది.
This post was last modified on February 23, 2024 11:45 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…