మామూలుగా ఫిబ్రవరి నెలలో రిలీజయ్యే సినిమాలకు మిగతా రోజుల్లో మాదిరి వసూళ్లు రావు. సంక్రాంతి తర్వాత.. మార్చి మూడో వరకు బాక్సాఫీస్‌కు డ్రై సీజన్‌గా పరిగణిస్తారు. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే ఈ టైంలో మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ టైంలో టాక్ అటు ఇటు అయితే వాషౌట్ అయిపోతుంటాయి సినిమాలు. ఈ ఏడాది కూడా సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియకుండా వెళ్లిపోయాయి. ఇలాంటి టైంలో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మాత్రం డివైడ్ టాక్‌ను తట్టుకుని తొలి వీకెండ్లో మంచి వసూళ్లే సాధించింది.
మూడు రోజుల వ్యవధిలో 17-18 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఈ సీజన్లో ఈ సినిమా స్థాయికి.. అందులోనూ డివైడ్ టాక్‌తో సాధించిన ఈ వసూళ్లు గొప్ప అనే చెప్పాలి. దీన్ని బట్టి ప్రి రిలీజ్ హైప్ సినిమాకు బాగా పని చేసిందని చెప్పాలి.
డివైడ్ టాక్‌తోనే ‘ఊరు పేరు భైరవకోన’ ఈ మేరకు వసూళ్లు సాధించిందంటే.. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండుంటే రిజల్ట్ గొప్పగా ఉండేదనడంలో సందేహం లేదు. గత ఏడాది ఇదే జానర్లో వచ్చిన ‘విరూపాక్ష’ తరహాలోనే బ్లాక్ బస్టర్ అయ్యేదీ సినిమా. కానీ ప్రోమోలు ఉన్నంత గొప్పగా సినిమా లేకపోయింది. సక్సెస్ ఫుల్ జానర్లో కథ రాసుకుని అన్ని హంగులూ బాగానే సమకూర్చుకున్నాడు కానీ.. కథను అనుకున్నంత థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు దర్శకుడు వీఐ ఆనంద్. సినిమాలో హై మూమెంట్స్ లేకపోవడం మైనస్ అయింది.
అయినా సరే బాక్సాఫీస్ దగ్గర సరైన పోటీ లేకపోవడం, థియేటర్లలో చూడదగ్గ చిత్రంలా కనిపించడం ‘ఊరు పేరు భైరవకోన’కు కలిసొచ్చాయి. ఉన్నంతలో సినిమా మెరుగైన వసూళ్లే సాధించింది. చాలా ఏళ్ల నుంచి వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న సందీప్ కిషన్‌కు ఇది కొంత ఊరటనిచ్చిన మాట వాస్తవం. కానీ అతను కోరుకున్న పెద్ద హిట్ అయితే ‘భైరవకోన’ కూడా అందించేలా కనిపించడం లేదు.
This post was last modified on February 19, 2024 4:07 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…