నిన్నటిదాకా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేసిన శ్రీలీలకు ఒక్కసారిగా ఫ్లాపుల వరద ఆలోచనలో పడేసింది. గుంటూరు కారం కమర్షియల్ గా భారీ వసూళ్లు తెచ్చినా మహేష్ బాబు రేంజ్, టాక్ పరంగా చూసుకుంటే జస్ట్ యావరేజని అభిమానులే ఒప్పుకుంటున్నారు. సో బ్లాక్ బస్టర్ కాదు. దీని కన్నా ముందు ఎక్స్ ట్రాడినరి మ్యాన్, ఆదికేశవ, స్కందలు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు కొట్టాయి. ఒక్క భగవంత్ కేసరి మాత్రమే పెద్ద హిట్టు కానీ తన డాన్సులు, గ్లామర్ లేకుండా శ్రీలీల చేసిన సినిమా ఇదొక్కటే. అది కూడా బాలయ్య క్రెడిట్ లోకి వెళ్ళింది.
ప్రస్తుతం శ్రీలీల కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎప్పుడు డేట్లు అవసరమవుతాయో దర్శకుడు హరీష్ శంకర్ కే తెలియదు. ఎన్నికలయ్యాక పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తే అప్పుడు కొనసాగిస్తారు. ఓజి పూర్తి కాకుండా ఇది సెట్స్ పైకి వెళ్దదు. అప్పటిదాకా శ్రీలీల వెయిటింగ్ చేయక తప్పదు. లేదూ అంటే వదులుకోవడం మినహా మరో మార్గం ఉండదు. పవర్ స్టార్ జోడిగా ఛాన్స్ ని చూస్తూ చూస్తూ వదల్లేదుగా. నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో రూపొందుతున్న రాబిన్ హుడ్ కోసం తననే అడిగారు కానీ ఇప్పటిదాకా అఫీషియల్ గా ప్రకటించనే లేదు.
హీరోయిన్ లేకుండా షూటింగ్ అయితే ప్రస్తుతం కానిస్తున్నారు. రేపో ఎల్లుండో ఎంట్రీ ఇప్పించాల్సిందే. ప్రకటన దాకా ఇది సస్పెన్సే. నెక్స్ట్ శ్రీలీలనే కావాలని కోరుకుంటున్న సినిమాలు ఇప్పటికిప్పుడు ఏమి లేవు. స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. మహేష్ 29 కోసం రాజమౌళి తీసుకోవడం డౌటే. చరణ్ బుచ్చిబాబు కాంబోకి జాన్వీ కపూర్ లాక్ అయ్యిందని ఆల్రెడీ టాక్ ఉంది. దేవర తర్వాత వార్ 2 చేసే జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామనే ఉంటుంది. ప్రభాస్ తో ఇప్పట్లో కుదరదు. నానితో ఆఫర్ వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. చూడాలి మరి ఫైనల్ గా ఎవరికి జోడిగా మారుతుందో.
This post was last modified on February 18, 2024 7:42 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…