విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ సారి సంచలనం చోటు చేసుకోనుందా? ఇక్కడ నుంచి వరుస విజయాలు దక్కించుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. గౌరవంగా పక్కకు తప్పుకోవాల్సిందేనా? ఎన్నికలకు ముందుగానే ఇక్కడ విజయం ఖరారైపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ నుంచి రంగంలోకి దిగనున్న యువ నాయకుడు, బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్.. వైపే సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారు.
“అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనేది మాకు అనవసరం. మాకు ఆది నుంచి అండగా ఉన్న అవినాష్ బాబుకే మాఓటు” అని స్థానికులు కుండబద్దలు కొడుతున్నారు. ఇక, కొండ ప్రాంతాలైన గిరిపురం, మాచవరంలోని కుటుంబాలు కూడా.. ఇదే మాట అంటున్నాయి. “మేం ఏన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఇంటి పట్టాలు ఇప్పించాడు. ఆయన కలలు నెరవేర్చాడు. మాకు కుళాయిలు ఇప్పించాడు. ఆయనకే మా ఓటు” అని ఇక్కడి కొంత ప్రాంత వాసులు నిక్కచ్చిగా చెబుతున్నారు.
ఇక, సెంట్రల్ నియోజకవర్గం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది.. ఆటోనగర్. ఇక్కడ నిత్యం కొన్ని వందల వాహనాలు రిపేర్లు అవుతాయి. కొత్తవి కూడా తయారవుతాయి. ఇక్కడి వారి ఆలోచన కూడా.. అవినాష్‌కు పాజిటివ్‌గానే ఉండడం గమనార్హం. “మేం ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తాం. మాకు గతంలో మరుగుదొడ్ల సదుపాయం లేదు. అవినాష్ బాబు పర్యటనకు వచ్చినప్పుడు చెప్పాం. మర్నాడే పనులు ప్రారంభించారు. అంతేకాదు.. మాకు రోడ్లు కూడా వేయించారు” అని ఆటోనగర్‌లో ఉండే లారీల యజమా నులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
మరోవైపు.. అనినాష్ గెలుపునకు మరో కీలక కారణం.. వయసు ఫ్యాక్టర్. ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను వృద్ధుడిగా చిత్రీకరించడంలో అవినాష్ సక్సెస్ అయ్యారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇది కూడా నిజమేనని అంటున్నారు. ఎందుకంటే.. ఏకార్యక్రమానికీ ఇటీవల కాలంలో గద్దె రావడం లేదు. పైగా.. తనకు ఒంట్లో బాగోలేదని చెబుతున్నారు. దీంతో ఆయన వయసు అయిపోయింది.. ఈ సారి నాకు ఓటేయాలని చెబుతున్న అవినాష్ ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా చేరుతున్నాయి. ఇక, యువత ఓట్లు ఎలాగూ.. కలిసి రానున్నాయి. పైగా.. తన తండ్రి నెహ్రూ సన్నిహితులు, మిత్రులు కూడా.. ఎలానూ ఉన్నారు. వెరసి.. ఆయన వయసు.. వ్యూహం వంటివి గెలుపును కాదు.. మెజారిటీపైనే అంచానలు పెంచుతుండడం గమనార్హం.
This post was last modified on February 18, 2024 7:51 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…