హిందీ సినీ పరిశ్రమలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ ఆల్ టైం బ్లాక్‌బస్టర్లలో ఒకటైన ‘దంగల్’లో స్టార్ రెజ్లర్ బబిత ఫొగాట్ చిన్ననాటి పాత్రను పోషించిన యువ నటి సుహానీ భట్నాగర్ అనారోగ్యంతో కన్నుమూసింది. దంగల్‌లో బాలనటిగా కనిపించిన సుహానీ వయసు ఇప్పుడు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులో ప్రాణాలు పోయేంత అనారోగ్యం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్ను మూసింది.
సుహాని ప్రాణాలు తీసిన జబ్బు పేరు.. డెర్మామయోసైటిస్. ఇది అరుదైన చర్మ వ్యాధి. ఈ జబ్బు బారిన పడిన వారికి చర్మం మీద పెద్ద పెద్ద బొడిపెలు వస్తాయి. వాటిని అదుపులోకి తేవడానికి స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. ఐతే జబ్బును ఆరంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలి. స్టెరాయిడ్స్‌ను తట్టుకునే శక్తి కూడా ఆ వ్యక్తికి ఉండాలి.
కానీ సుహానీ శరీరం స్టెరాయిడ్స్‌ను తట్టుకోలేకపోయింది. స్టెరాయిడ్స్ ప్రభావం సుహాని ఒంట్లోని అనేక అవయవాల మీద పడింది. అంతర్గత రక్తస్రావం జరిగింది. దీంతో ఒక్కొక్కటిగా అవయవాలు పని చేయడం మానేశాయి. చివరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టమై ప్రాణం పోయింది.
సుహాని కొన్ని నెలల ముందు వరకు మామూలు మనిషిలాగే ఉందట. ఆమె డెర్మామయోసైటిస్ బారిన పడ్డ విషయం కూడా ఆలస్యంగా గుర్తించారు. చర్మం మీద పొక్కులు చూసి డెర్మటాలజిస్ట్‌లను కలవడం.. వాళ్లు ఏవో మందులు ఇవ్వడం.. సమస్య పరిష్కారం కాకపోవడం జరిగింది. చివరికి తీవ్రత పెరిగి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు తల్లిదండ్రులు. అక్కడే ఆమె డెర్మామయోసైటిస్ బారిన పడ్డ విషయం గుర్తించి.. చికిత్సలో భాగంగా పది రోజుల కిందట స్టెరాయిడ్స్ వాడడం మొదలుపెట్టారు. కానీ ఈ చికిత్సను ఆమె శరీరం తట్టుకోలేక 19 ఏళ్ల వయసులోనే తనువు చాలించి అందరినీ విషాదంలోకి నెట్టింది సుహాని.
This post was last modified on February 18, 2024 1:44 pm
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…