మహేష్‍ నుంచి ట్వీట్‍ లేదు

తన కెరియర్‍ని ‘వి’ మలుపు తిప్పుతుందని సుధీర్‍ బాబు చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాని లాంటి పాపులర్‍ నటుడి సినిమాలో హీరో పాత్ర పోషించడం, తనకూ పాటలూ, ఫైట్లూ వుండడంతో పాపం సుధీర్‍ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. సినిమా ఓటిటిలో రిలీజ్‍ అవుతుందన్నా కానీ నిరాశ పడిపోకుండా గట్టిగా ప్రమోషన్స్ చేసాడు. ఈ చిత్రం గురించి, తన నటన గురించి తన బావ మహేష్‍ నుంచి ట్వీట్‍ పడుతుందని సుధీర్‍ ఆశించి వుంటాడు. అయితే ఈ సినిమా చూసేసి కిమ్మనకుండా వున్న మిగతా అందరు సెలబ్రిటీస్‍లానే మహేష్‍ కూడా మౌనం పాటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని మన హీరోలు, దర్శకులు చూడలేదు అనుకోవడానికి లేదు. అందరూ హోమ్‍ థియేటర్స్ లో ఫ్యామిలీస్‍తోనే చూసేసారు. అయితే ‘వి’ చిత్రానికి వచ్చిన యునానిమస్‍ బ్యాడ్‍ టాక్‍ వల్ల ఇక సెలబ్రిటీలు మొహమాటం ట్వీట్స్ కి దూరంగా వుంటున్నారు. దిల్‍ రాజు, నాని కూడా ఈ చిత్రం ఫలితాన్ని ముందే ఊహించడం వల్లే ఓటిటి రిలీజ్‍కి ఓకే చెప్పేసారనే కామెంట్స్ వినిపిస్తున్నా కానీ వాళ్లు వాటిపై స్పందించడం లేదు. ఇక సుధీర్‍ విషయానికి వస్తే నటుడిగా ఎంత కష్టపడుతున్నా కానీ హీరోగా తనకు బూస్ట్ ఇచ్చే సినిమా మాత్రం పడడం లేదు.