బిగ్‌బాస్ 4 హౌస్‌లోకి పదహారు మంది వెళ్లారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్సయిటింగ్ కంటెస్టెంట్ లేడనే కామెంట్లు పడుతున్నాయి. ఎక్కువ మంది యూట్యూబ్, సోషల్ మీడియా సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపించారు. లోనికి వెళ్లిన వారిలో చాలా మంది పేర్లు కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులకు తెలియవు. సినిమా వినోదం అంతగా లేని టైమ్‌లో నిర్వహిస్తోన్న ఈ సీజన్‌కి ఖచ్చితంగా ఆడియన్స్ బాగుంటారని స్టార్‌మా నెట్వర్క్ కి తెలుసు. అయినా కానీ ఎందుకని స్టార్ కంటెస్టెంట్స్‌ని తీసుకోలేదు? కరోనా భయంతో రైజింగ్‌లో వున్న పాపులర్ సెలబ్రిటీలు ఎవరూ హౌస్‌లోకి వెళ్లే రిస్క్ తీసుకునేందుకు ముందుకు రాలేదు. నెక్స్ట్ సీజన్‌కి వస్తామని ఎవరికి వారు ఆఫర్ రిజెక్ట్ చేసారట.
అయితే సీజన్ చేసి తీరాలని డిసైడ్ అవడంతో అందుబాటులో వున్న వారిలోనే తమకు బెస్ట్ ఆప్షన్ అనుకున్నవారిని ఎంచుకున్నారట. అయితే ఇది ఒక రకంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్‌కి ప్లస్ అవుతుంది. తేజస్వి, బాబు గోగినేని, శ్రీముఖి లాంటి స్టార్లు వుంటే పోటీ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్లిన వారిలో ఎవరికీ అంతగా ఫాన్ బేస్ లేదు కనుక వాళ్లు గేమ్ ఆడే విధానం, వాళ్ల పద్ధతులతోనే ప్రేక్షకులను గెలుచుకోవాలి. అయితే స్టార్ ఆకర్షణలు లేని ఈ స్టార్ మా పోగ్రామ్ మునుపటిలా భారీ టీఆర్పీలు దక్కించుకోగలదా?