Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సరికొత్త సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”

అపార్ట్మెంట్ వాతావరణంలో సరదా సరదాగా జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటి సిట్-కామ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ డిస్కషన్ పాయింట్ అయింది.

మన కథే తెరకెక్కిందా అనిపించేంత సహజంగా.. హాయిగా నవ్వుకునేలా ఉండడం, కొంచెం ఆలోచింపచేయడం – “మిస్ పర్ఫెక్ట్” అంతగా నచ్చడానికి కారణం. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో వుండే రకరకాల మనుషులు, పని అమ్మాయి, చిన్న చిన్న విషయాలకి చిలవలు పలవలు కలిపి మాట్లాడుకునే మనుషులు, టైం పాస్ చేసేవాళ్ళు.. అందరూ మన చుట్టూ తిరిగే పాత్రలే.. మనకి పరిచయమైన జనాలతో రకరకాల పాత్రలతో ఈ సిరీస్ ని లైవ్లీ గా ప్లాన్ చేశారు యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావ్.

రహస్యాలు, ద్వంద్వ జీవితాలు, రెండో అవకాశాల చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతి ఒక్కరి పర్సనల్, ప్రొఫెషనల్ స్ట్రగుల్ లో సున్నితమైన అంశాలను చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఒకరి ప్రవర్తన చుట్టుపక్కల మనుషుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పి లైటర్ వీన్ స్టోరీ “మిస్ పర్ఫెక్ట్”.

అందాల రాక్షసి, సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ సినిమాలతో తెలుగువాళ్లకి బాగా దగ్గరైన లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రతో  తనలోకి ఒక కొత్త నటిని మనకు పరిచయం చేసింది. ఆమె క్యారెక్టర్ పేరు కూడా లావణ్య. పాత్ర గా లావణ్య కి క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. ఏదయినా పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం ఆమె బలం. దానికోసం రూల్స్ బ్రేక్ చేయడానికైనా ఆమె సిద్ధం. ఏదయినా వస్తువు ఉండాల్సింది ఉండాల్సినట్టు లేకపోతే ఈమెకి చాలా చిరాకు.

అలాగే  ఈ సిరీస్ లో ప్రతి పాత్రా ముఖ్యమైనదే. హర్ష వర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా , అభిజీత్, అభిజ్ఞ, హర్ష్ రోషన్, సునయన, రూప లక్ష్మి, కేశవ్ దీపక్, మాణిక్ రెడ్డి మిగతా పాత్రల్లో మెరిశారు. ఇది ఓ ప్రత్యేకమైన కథ. మన చుట్టూ కనిపించే మనుషులతో అల్లిన కథ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “మిస్ పర్ఫెక్ట్” స్ట్రీమ్ అవుతోంది. తప్పక చూడండి.

“మిస్ పర్ఫెక్ట్ ” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/491eYxc

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on February 3, 2024 8:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాలయ్య వస్తే మీకే మంచిది అంటున్న రాజా సాబ్ డైరెక్టర్

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…

12 minutes ago

ఎన్నికల వరకు ఓర్చుకోండి అని జగన్ సూచన?

వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…

17 minutes ago

పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

``స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి…

25 minutes ago

అఖండకు ఆలస్యమనే విషం అమృతంగా మారింది

గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…

45 minutes ago

అక్కర్లేని వివాదం ఎందుకు హృతిక్

భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…

2 hours ago

అవేవీ లేకపోయినా మోగ్లీ’కి ఎ సర్టిఫికెట్

ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…

2 hours ago