అర్జున్‌కు కరోనా.. ఆ వెంటనే ఆమెకు

ఇండియాలో కరోనా తీవ్రత అధికా స్థాయిలో ఉన్న నగరం ముంబయి. దేశం మొత్తంలో మహారాష్ట్రనే అత్యధిక కేసులున్న రాష్ట్రం కాగా.. నగరాల్లో ముంబయి టాప్‌లో ఉంది. అలాంటపుడు ముంబయి కేంద్రంగా నడిచే బాలీవుడ్లో సెలబ్రెటీలు కరోనా బారిన పడకుండా ఎలా ఉంటారు? ఈ వైరస్ బారిన పడి వాజిద్ ఖాన్ లాంటి ప్రముఖ సంగీత దర్శకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అమితాబ్ బచ్చన్ సహా ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి యువ కథానాయకుడు అర్జున్ కపూర్ కూడా చేరాడు. అతను వైరస్ బాధితుడైనట్లు ఆదివారమే వెల్లడైంది. ఐతే ఈ విషయాన్ని అంతా మామూలుగానే చూశారు కానీ.. ఇంకొన్ని గంటల్లోనే మలైకా అరోరా సైతం వైరస్ బారిన పడ్డట్లు వెల్లడి కావడం ఆసక్తి రేకెత్తించింది.

మలైకా అరోరాకు సంబంధించిన కరోనా టెస్ట్ రిపోర్ట్‌ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇది ఆమె సోదరి అమృతా అరోరాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీని మీద ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఐతే ఎలాగూ విషయం బయటపడిపోవడంతో మలైకా తనకు కరోనా సోకిన విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. అర్జున్‌, మలైకాలకు అధికారికంగా అయితే ఏ సంబంధం లేదు.

కానీ సల్మాన్ సోదరుడైన తన భర్త అర్బాజ్‌ ఖాన్‌కు కొన్నేళ్ల కిందట విడాకులు ఇచ్చేసిన మలైకా.. అప్పట్నుంచి అర్జున్‌తోనే ఉంటోంది. విడాకులు ఇవ్వడానికి ముందే వీళ్లిద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయి. విడాకుల తర్వాత కొంత కాలం ఈ బంధాన్ని దాచిన మలైకా.. ఆ తర్వాత ఓపెన్ అయిపోయింది.

ఇద్దరూ బయట చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఒక ఫ్లాట్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్‌కు కరోనా అనగానే.. మలైకా కూడా వైరస్ బారిన పడ్డట్లు వెల్లడి కావడంతో వీరి బంధం గురించి మరోసారి గుసగుసలు మొదలయ్యాయి.