మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజుల తర్వాత ఒక రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో ఈ నలుగురు హీరోల ఆధిపత్యమే సాగింది. వీరు ప్రైమ్‌లో ఉండగా.. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు ఈ నలుగురితోనూ సినిమాలు చేసిన ఘనతను అందుకున్నారు.
ఐతే తర్వాతి తరం దర్శకుల్లో ఎవ్వరూ ఈ నలుగురినీ కవర్ చేసిన రికార్డును అందుకోలేదు. వి.వి.వినాయక్ మిగతా ముగ్గురితో సినిమాలు చేశాడు కానీ.. నాగార్జునను కవర్ చేయలేకపోయాడు. శ్రీనువైట్ల ముగ్గురిని కవర్ చేశాడు కానీ.. బాలయ్యను డైరెక్ట్ చేయలేకపోయాడు. వీరి తర్వాత ఈ సీనియర్ హీరోల్లో ముగ్గురిని కవర్ చేసిన ఘనత అనిల్ రావిపూడిదే. అతను ఆల్రెడీ వెంకటేష్, బాలయ్యలతో సినిమాలు చేశాడు. ఇప్పుడు చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ తీశాడు. ఇక మిగిలింది నాగార్జున మాత్రమే.
అక్కినేని హీరోతో కూడా తాను తప్పకుండా సినిమా చేస్తానని ధీమాగా చెబుతున్నాడు అనిల్. నాగ్ ఒక్కడితో సినిమా చేస్తే ఒక స్పెషల్ రికార్డు తన సొంతం అవుతుందని.. అందుకోసం తాను సిద్ధంగా ఉన్నానని అనిల్ చెప్పాడు. నాగ్‌తో సినిమా ఉంటుందని, అది ఎప్పుడన్నది చెప్పలేనని అన్నాడు. తన తర్వాతి సినిమా ఏదో ఇంకా ఖరారవ్వలేదని.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజయ్యాక రెండు వారాలు గ్యాప్ తీసుకుని తర్వాతి నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని అనిల్ తెలిపాడు.
తన మాటల్ని బట్టి చూస్తే నాగ్ ఓకే అంటే తర్వాతి సినిమాను ఆయనతో చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే ఉన్నాడు అనిల్. ప్రస్తుతం తమిళ దర్శకుడు రా.కార్తీక్‌తో తన వందో సినిమా చేస్తున్నాడు నాగ్. అది పూర్తి కాగానే అనిల్‌తో సినిమా చేయడానికి ఓకే అంటే.. ఆలోపు అతను స్క్రిప్టు రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటాడు. సీనియర్ హీరోల బలానికి తగ్గట్లు, వారి టైమింగ్‌కు కుదిరేలా.. వారి అభిమానులకు నచ్చేలా ప్రెజెంట్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు అనిల్. నాగ్ కూడా అతడితో సినిమాకు ఓకే అనాలే కానీ.. తన ఫ్యాన్స్‌కు నోస్టాల్జిక్ ఫీల్ వచ్చేలా ఆయన్ని తెరపై ప్రెజెంట్ చేస్తాడనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates